శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 22 అక్టోబరు 2018 (13:25 IST)

భర్త బట్టలు కొనివ్వలేదని.. భార్య ఆత్మహత్య..

భర్త బట్టలు కొనేందుకు డబ్బివ్వలేదని భార్య ఆత్మహత్య చేసుకుంది. తనకి ఇద్దరు పిల్లలున్నారని కూడా ఆలోచించకూండా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నెల్లురూలో చోటుచేసుకుంది. భర్త పేరు నాగరాజు, భార్య పేరు వాణి. 2012 సంవత్సరంలో ఇద్దరికి పెళ్లి జరిగింది. నాగరాజు మార్బుల్స్‌కు పాలిష్ వేసే పనులు చేస్తున్నాడు.
 
ఓ నాడు వాణి బంధువులు చిన్నమ్మ కూమార్తె బిడ్డకు పుట్టు వెంట్రుకలు తీస్తున్నాం.. రండీ అంటూ ఆమెను ఆహ్వానించారు. అప్పుడు వాణి ఈ శుభకార్యానికి వెళితే వారికి బట్టలు పెట్టాలని, అందుకు డబ్బులు కావాలని భర్తను కోరింది. దాంతో భార్య, భర్త మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి వాణిని నాగరాజు బాగా తిట్టేసాడు.

దాంతో అసహనానికి లోనైన వాణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు వెంటనే దర్గామిట్ట పోలీసులకు తెలియజేశారు. ఇంట్లో జరిగిన గొడవ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.