ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 19 అక్టోబరు 2018 (13:45 IST)

ప్రేయసితో నా భర్త... పచ్చడి బండతో కొట్టి చంపేశా.. ఓ భార్య

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. భర్త మరో మహిళతో సన్నిహితంగా వున్నాడంటూ.. ఆమెతో గంటల పాటు ఫోనులో చాటింగ్ చేస్తున్నాడని.. భార్య సహించుకోలేకపోయింది. అంతే.. భర్తను ఎలాంటి దయాదాక్షిణ్యాలు లేకుండా చంపేసింది. ఈ ఘటన భీమవరంలోని మారుతీనగర్‌లో చోటుచేసుకుంది.
 
వివరాలకు వెళ్లే.. భర్త ఓ అమ్మాయితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని పొరిగింటివారు చెప్తే.. ఆ మహిళ పెద్దగా పట్టించుకోలేదు. తన భర్తకు ఆమె స్నేహితురాలై వుంటుందని వదిలేసింది. ఒకరోజు భర్త అదే మహిళతో బయటకు వెళుతుండగా సుబ్బలక్ష్మీ వారి ఇద్దరిని కళ్లారా చూసింది. 
 
బంధువులు కూడా ఆ ఇద్దరిని చూచి వెంటనే అతని భార్యకు తెలియజేశారు. దాంతో సుబ్బలక్ష్మీ అసహనానికి లోనయ్యింది. ఏం చేయాలో తెలియక అనుమానంతో భర్తను పచ్చడి బండతో తలమీద కొట్టి హత్య చేసింది. అనంతరం ఆమె పోలిస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.