ఫోనులో 'చస్తేచావనీ... అని భర్త అన్నాడనీ భార్య ఆత్మహత్య
ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. చస్తే చావని అని భర్త అన్నాడనీ ఆమె తనువు చాలించింది. విశాఖపట్టణం జిల్లా పెందుర్తిలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... పెందుర్తికి చెందిన చరణ్ తేజ్ అనే వ్యక్తికి నీలిమ అనే మహిళతో వివాహమైంది. వీరికి ఓ బాబు ఉన్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం బాబును చూసేందుకు అత్తవారింటికి చరణ్‌తేజ్ వచ్చాడు. ఆ తర్వాత పుట్టింటి నుంచి కాపురానికి ఎప్పుడు తీసుకెళతారంటూ భర్తను నీలిమ అడగడంతో ఆమెపై మండిపడ్డారు. వారిమధ్య వాగ్వాదం కూడా జరిగింది.
దీంతో నీలిమ తీవ్ర మనస్తాపానికి గురైంది. కుమార్తె నీలిమ కలత చెందడం గమనించిన ఆమె తల్లి ఆదిలక్ష్మి అల్లుడుకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించింది. అయితే ఫోన్‌లో 'చస్తేచావని..' అంటూ చరణ్‌తేజ్ పరుషంగా మాట్లాడాడు. అది విన్న నీలిమ క్షోభకు గురైంది. అనంతరం తన బాబుకు పాలు పట్టమని తల్లికి చెప్పి తన గదిలోకి వెళ్లింది. తన కుమారుడి ఊయల చీరను ఫ్యానుకు బిగించి ఆత్మహత్య చేసుకుంది.
తన కుమారై ఎంతకీ బయటికి రాకపోవడంతో ఆదిలక్ష్మికి అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా నీలిమ ఉరి వేసుకుని వేలాడుతు కనింపించింది. ఆదిలక్ష్మి ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహ్నాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు తన కుమారై నీలిమ మృతికి భర్త చరణ్‌తేజ్‌తో పాటు అత్త, మామల వేధింపులే కారణమని మృతురాలు తల్లి ఆదిలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.