శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: సోమవారం, 15 అక్టోబరు 2018 (12:25 IST)

35 ఏళ్ల యువకుడు 18 ఏళ్ల యువతిని పెళ్లాడవచ్చా?

నా వయసు 35 సంవత్సరాలు. పెళ్లి కావాలంటే ఉద్యోగం వచ్చే వరకూ ఆగాల్సిందేనని మా పేరెంట్స్ కండిషన్ పెట్టారు. దాంతో ఎలాగో కష్టపడి ఇప్పుడే ఉద్యోగాన్ని తెచ్చుకున్నాను. ఇటీవల నాలుగైదు సంబంధాలు చూశారు. కానీ మా పేరెంట్స్‌కు ఓ అమ్మాయి బాగా నచ్చింది. నాక్కూడా నచ్చింది. ఐతే ఆమెకు 18 ఏళ్లే. ఆమెకు నాకు దాదాపు 17 ఏళ్ల గ్యాప్ ఉంది. పెళ్లయ్యాక ఆమె 30ల్లోకి వచ్చేసరికి నేను 40లు దాటిపోతాను. శృంగారం సమస్య ఉత్పన్నమై ఏమయినా ఇబ్బంది వస్తుందేమోననే అనుమానం ఉంది... అలా అవుతుందా...?
 
శృంగార సామర్థ్యం వయసును బట్టి మారుతూ ఉంటుంది. స్త్రీ విషయానికి వస్తే కనీసం 20 ఏళ్లు దాటకుండా పెళ్లి చేస్తే ఆమె శరీరకంగా చాలా సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. చిన్న వయసులోనే తల్లి కావడం, ఆ వయసులో ఆమె ఆరోగ్యానికి హానికరం. ఏదేమైనా నాలుగైదేళ్లు తేడాను మించి పెళ్లాడటం వల్ల పెద్దగా ఇబ్బందులు వుండవు. అలా కాకుండా పదేళ్లు అంతకంటే ఎక్కువ వ్యత్యాసంతో పెళ్లాడితే ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారం లేకపోలేదు. కనుక ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.