గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 13 అక్టోబరు 2018 (13:23 IST)

నీ ఫోన్ ఎప్పుడూ బిజీయెందుకు? భర్త అడిగినందుకు భార్య సుసైడ్, భర్త కూడా...

మనస్పర్ధలు వచ్చాయని భార్య ఆత్మహత్య చేసుకుంది. భార్య తన కారణంగా ఆత్మహత్య చేసుకుందని భర్త  ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకున్నాడు. అతని శరీరంలో హైవోల్టేజ్ ప్రవేశించింది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా వుంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, సోములగూడెం గ్రామానికి చెందిన గోపీశెట్టి దుర్గారావుకు రెండు నెలల క్రితం పాల్వంచకు చెందిన ఉషారాణితో వివాహం జరిగింది. దుర్గారావు ప్రస్తుతం ఓ ఇటుకల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు.
 
శుక్రవారం నాడు ఉదయం అతను తన భార్యకు ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసిన బిజీగా ఉన్నట్లు వస్తుందని దుర్గారావు కోపానికి లోనయ్యాడు. కాసేపటి తరువాత ఫోన్ కనెక్ట్ అయ్యింది. అప్పుడు అతను ఉషారాణిని ఎవరితో మాట్లాడుతున్నావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాంతో ఉషారాణి ఆందోళన చెంది వెంటనే ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
 
సాయంత్రమే తన భార్య ఉరేసుకుని చనిపోయిందనే విషయం దుర్గారావుకు తెలియవచ్చింది. వెంటనే ఇంటి వెళ్ళాడు. తన కారణంగానే ఉష చనిపోయిందని దుర్గారావు ఆవేదనతో వీధి చివరన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకున్నాడు. దాంతో హైఓల్టేజ్ విద్యుత్ అతని శరీరంలోనికి ప్రవేశించి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. 
 
ఇక అక్కడున్న వాళ్ళు వెంటనే అతనిని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.