శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 8 అక్టోబరు 2018 (17:25 IST)

గూగుల్‌ తప్పులో కాలేసింది.. నందమూరి బాలకృష్ణ మరణతేదీని?

సెర్చింజన్ గూగుల్‌లో వెతికితే దొరకని పదానికి కూడా అర్థం దొరుకుతుంది. అలాంటి సెర్చింజన్.. తప్పులో కాలేసింది. నందమూరి హీరో బాలయ్యను గూగుల్ చంపేసింది.

సెర్చింజన్ గూగుల్‌లో వెతికితే దొరకని పదానికి కూడా అర్థం దొరుకుతుంది. అలాంటి సెర్చింజన్.. తప్పులో కాలేసింది. నందమూరి హీరో బాలయ్యను గూగుల్ చంపేసింది. ఇదేంటి అని షాక్ తిన్నారు కదా.. అయితే చదవండి. కొన్ని పొరపాట్ల కారణంగా గూగుల్ తప్పుడు సమాచారం ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే నందమూరి పేరును సెర్చ్‌లో కొట్టినప్పుడు ఆయన మరణ తేదీని కూడా గూగుల్ చూపెట్టింది. 
 
గూగుల్‌లో మనం దేనికోసమైనా.. వెతికినప్పుడు దానికి సంబంధించిన సమాచారం ఏఏ సైట్స్‌లో ఉందో గమనించి ఆ వివరాలను గూగుల్ మనకి చూపిస్తుంది. ఒకే పదంతో వెతికితే ఆ పదానికి సంబంధించిన సమాచారాన్ని వెతికిపెడుతుంది. ఇక్కడే గూగుల్ పప్పులో కాలేసింది.
 
గూగుల్‌లో నందమూరి బాలకృష్ణ సమాచారం కోసం వెతికితే కన్నడ సినిమా రంగంలో టి.ఎన్.బాలకృష్ణ అని మరో సీనియర్ నటులు ఉన్నారు. దీంతో ఆయన వివరాలను బాలకృష్ణకి జోడించి చూపిస్తోంది. ఇందులో నందమూరి బాలయ్య మరణ తేదీని 19 జూలై, 1995గా చూపిస్తోంది.