సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: శనివారం, 13 అక్టోబరు 2018 (13:46 IST)

శృంగారమంటే చాలు... ఆ తోట దగ్గరకి తీసుకెళుతున్నాడు...

ఇటీవలె మాకు పెళ్లయింది. శోభనంనాడు అతడు నన్ను ఏమేమి చేస్తాడో అని ఏదేదో ఊహించుకున్నా. కానీ నేను అనుకున్నదేమీ జరుగలేదు. నాతో ఏదో కాసేపు మాట్లాడి నిద్రపోయాడు. మరుసటిరోజు కూడా అంతే. అలా 10 రోజులు గడిచిన తర్వాత మా భర్తవాళ్లకున్న మల్లెతోటకు తీసుకుపోయాడు. అక్కడ ఓ ఫామ్ హౌసు లోపల శృంగారం చేశాడు. 
 
మా భర్త వాళ్లది వ్యవసాయ కుటుంబం. అందువల్లనే ఇలా పొలానికి తీసుకొచ్చి ఏదో ఒక్కరోజు చేశాడనుకున్నా. కానీ శృంగారం చేయమంటే చాలు... మల్లెతోటకు తీసుకుపోతున్నాడు. అక్కడే చేస్తున్నాడు. అదేమని అడిగితే తనకు అక్కడే మూడ్ వస్తుందంటున్నాడు. పడక గదిలో అసలు చేయడంలేదు. ఆయన మనసు మార్చేదెలా...?
 
చూస్తుంటే అతడు తన భార్యతో అక్కడే శృంగారంలో పాల్గొనాలని చానాళ్లుగా అనుకుని ఉన్నట్లు అర్థమవుతుంది. ఆ సరదా అతనికి తీరుతోంది. మల్లెతోటలో మల్లెల సువాసనలను ఆస్వాదిస్తూ చేయాలనే కోరిక ఉండివుండవచ్చు. అందువల్ల శృంగారం అంటే అక్కడికే వెళ్లాలంటున్నాడు. 
 
ఐతే ఆ ప్రదేశం కంటే పడకగది మరింత మూడ్‌ను తెచ్చే విధంగా అలంకరిస్తే సరి. రాత్రివేళ మల్లెల సువాసనలే కాకుండా సుగంధ పరిమళాలు వెదజల్లె అత్తర్లను వాడాలి. పడకగదిని విడిచి బయట ఎక్కడో చేయలేని స్థితికి తీసుకురాగలగాలి. అప్పుడతడు బెడ్రూంలోనే శృంగారం చేయక తప్పని పరిస్థితి వస్తుంది.