శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: సోమవారం, 8 అక్టోబరు 2018 (21:31 IST)

బహుశా... శృంగారంలో పాల్గొనే జంటకు ఈ 5 పాయింట్లు తెలియకపోవచ్చు...

శృంగారానికి సంబంధించి తమకు అన్నీ తెలుసు అని చాలామంది గొప్పలు చెప్పుకుంటుంటారు. నిజానికి అందులో ఎన్నో తెలియని విషయాలు, ఆశ్చర్యపరచే వాస్తవాలు, నిజామా అని అనిపించేవి చాలానే ఉన్నాయి.

శృంగారానికి సంబంధించి తమకు అన్నీ తెలుసు అని చాలామంది గొప్పలు చెప్పుకుంటుంటారు. నిజానికి అందులో ఎన్నో తెలియని విషయాలు, ఆశ్చర్యపరచే వాస్తవాలు, నిజామా అని అనిపించేవి చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని...
1. ఒక ఆరోగ్యవంతుడైన పురుషుని శరీరం నుండి రెండు వారాల్లో ఉత్పత్తి అయ్యే వీర్యంతో ప్రపంచంలో ఉన్న స్త్రీలందరికీ గర్భధారణ చేయొచ్చట.
 
2. వీర్య కణాలు శరీరం బయట అయితే కొద్ది గంటలే జీవిస్తాయి, అవే స్త్రీ జననాంగంలో ప్రవేశిస్తే 3 నుండి 5 రోజులు జీవించి ఉంటాయి.
 
3. శృంగారం తర్వాత మూత్ర విసర్జన చేస్తే మూత్రనాళంలో వచ్చే ఇన్ఫెక్షన్స్‌ను కొద్దివరకు అరికట్టవచ్చు. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి శృంగారం ఎంతగానో సహకరిస్తుంది. లైంగిక చర్యలో పాల్గొన్నాక బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది, అలజడి కూడా తగ్గుతుంది.
 
4. తలనొప్పిని తగ్గించే సహజమైన ఔషధం శృంగారం. స్త్రీలు రుతుక్రమం (పీరియడ్స్) వచ్చే ముందు రోజుల్లో శృంగారం మీద బాగా ఆసక్తి చూపుతారు. శృంగారంలో భావప్రాప్తి పొందే సమయంలో గుండె నిమిషానికి 140 సార్లు కొట్టుకుంటుంది.
 
5. స్త్రీలలో స్వయంతృప్తి పొందేటప్పుడు 4 నిమిషాల్లోనే భావప్రాప్తి జరుగుతుంది, అదే శృంగారంలో పాల్గొన్నప్పుడు 10 నుండి 20 నిమిషాలు పడుతుంది. ఎక్కువమంది స్త్రీలు బాగా వెలుతురు ఉన్న గదిలో కన్నా తక్కువ వెలుతురు లేదా చీకటిగా ఉన్న గదిలో శృంగారంలో పాల్గొనేందుకు ఇష్టపడుతారు.