బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By chj
Last Modified: గురువారం, 4 అక్టోబరు 2018 (20:56 IST)

భార్యాభర్తలిద్దరూ శృంగారంలో స్వర్గపుటంచులు తాకాలంటే...

భార్యాభర్తలిద్దరూ శృంగారంలో స్వర్గపుటంచులు చవిచూడాలనీ తహతహలాడుతుంటారు. ప్రతి భర్త తన భార్యను సుఖపెట్టాలని కోరుకుంటాడు. కానీ ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి, సమస్యలు, సరైన ఆహారం తీసుకోకపోవడం లాంటి సమస్యల వల్ల పురుషుల్లో శీఘ్రస్ఖలనం సమస్య తలెత్తుతుంది.

భార్యాభర్తలిద్దరూ శృంగారంలో స్వర్గపుటంచులు చవిచూడాలనీ తహతహలాడుతుంటారు. ప్రతి భర్త తన భార్యను సుఖపెట్టాలని కోరుకుంటాడు. కానీ ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి, మానసిక సమస్యలు, సరైన ఆహారం తీసుకోకపోవడం లాంటి సమస్యల వల్ల చాలామంది పురుషుల్లో శీఘ్రస్ఖలనం ఒక సమస్యగా తయారయ్యింది. 

శృంగారం మొదలుపెట్టగానే త్వరగా స్ఖలనం జరిగి భార్యాభర్తలిద్దరూ అసంతృప్తికి గురి అవుతున్నారు. మందులతో ఈ సమస్యకు తాత్కాలికంగా మాత్రమే ఉపశమనం లభిస్తుంది. అయితే ప్రకృతిపరంగా లభించే కొన్ని పండ్లలో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం.
 
1. పుచ్చకాయలో లైంగిక సామర్థ్యం పెంచే గుణాలు మెండుగా ఉన్నాయి. ఇందులో ఉండే పోషకాలు, అమైనో ఆమ్లాలు జననాంగాలకు రక్తసరఫరా బాగా జరిగేలా చేస్తుంది. ఎప్పుడైతే అంగానికి కావలసినంత రక్తం ప్రసరిస్తుందో అప్పుడు శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనే అవకాశం కలుగుతుంది.
 
2. తేనె కలిపిన పాలు కూడా మగవారిలో శృంగార సామర్ద్యాన్ని పెంచగలదు. శీఘ్రస్ఖలన సమస్యకు సత్వరం పరిష్కరించే శక్తి ఈ తేనె కలిపిన పాలుకు ఉంది. అంతేకాకుండా తక్షణ శక్తి కూడా లభించి శృంగారం ఎక్కువసేపు చేసే అవకాశం కూడా ఉంది.
 
3. కలబంద జ్యూస్ పురుషుల్లోని టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది పురుషునిలో లైంగిక సామర్ద్యాన్ని పెంచే గుణాలను కలిగి ఉంది. ఈ జ్యూస్ శరీరాన్ని ఉత్తేజంగా మారుస్తుంది. అలాగే అంగస్తంభన సమస్యను తొలగించి లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది.