శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 4 అక్టోబరు 2018 (12:16 IST)

వర్షాకాలంలో పిల్లలకు సూప్‌లు, చేపలు తినిపించండి..

వర్షాకాలంలో పిల్లలకు సూప్‌లు, చేపలు తినిపించడం ద్వారా వారిలో వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు అనారోగ్య సమస్యలు దూరమవుతాయని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు.

వర్షాకాలంలో పిల్లలకు సూప్‌లు, చేపలు తినిపించడం ద్వారా వారిలో వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు అనారోగ్య సమస్యలు దూరమవుతాయని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పాల పదార్థమైన దీన్ని పిల్లలు ఇష్టంగా తింటారు. సులువుగా అరుగుతుంది కూడా. ఇందులో మాంసకృత్తులూ, విటమిన్‌-బి12, ఫాస్ఫరస్‌ ఉంటాయి.కాబట్టి చిన్నారులు తీసుకునే ఆహారంలో దీన్ని కూడా చేర్చుకోవడం ద్వారా సులభంగా  క్యాల్షియం అందుతుంది. 
 
అలాగే కోడిగుడ్లు కూడా పిల్లలకు రోజుకొకటి చొప్పున ఇస్తుండాలి. వీటిలో ఎక్కువ మొత్తంలో ఉండే మాంసకృత్తులూ, విటమిన్‌-బి పోషకాలు మెదడు అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటితోపాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్‌-డి, ఫోలియేట్‌, జింక్‌, ఇనుము, సెలీనియం ఉంటాయి. ఇవన్నీ పెరుగుదలకు తోడ్పడుతాయి. కాబట్టి ప్రతిరోజూ ఓ కోడిగుడ్డును పిల్లలకు ఇవ్వడం మరిచిపోకూడదు. 
 
ప్రతిరోజూ రెండుపూటలా చిన్నారులకు పాలు తాగడం అలవాటు చేయాలి. ఇంకా వర్షాకాలంలో చిక్కుడూ, సోయా, రాజ్మా, ఉలవలను స్నాక్స్‌‍గా ఇస్తుండాలి. ఇలా చేస్తే పిల్లల్లో పెరుగుదలతో పాటు సులభం పోషకాలు అందుతాయని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.