గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : సోమవారం, 1 అక్టోబరు 2018 (14:59 IST)

మాంసాహారం తిన్నాక తలంటు స్నానం చేసి దైవ దర్శనం చేసుకోవచ్చా?

మాంసాహారం తీసుకుని తలంటు స్నానం చేసి దైవ దర్శనం చేసుకోవచ్చా.. అనే అనుమానం మీలో వుందా.. అయితే ఈ కథనం చదవండి. మాంసాహారం తీసుకున్నప్పటికీ.. స్నానం చేసి లేదా తలంటు స్నానం చేసి దర్శనం చేసుకోవచ్చునని కొందరు

మాంసాహారం తీసుకుని తలంటు స్నానం చేసి దైవ దర్శనం చేసుకోవచ్చా.. అనే అనుమానం మీలో వుందా.. అయితే ఈ కథనం చదవండి. మాంసాహారం తీసుకున్నప్పటికీ.. స్నానం చేసి లేదా తలంటు స్నానం చేసి దర్శనం చేసుకోవచ్చునని కొందరు అనుకుంటారు. కానీ అది ఎంతమాత్రం సరికాదు.


మాంసాహారం తీసుకుని ఒక రాత్రి గడిచిన తర్వాతే ఆలయ దర్శనం చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. సాధారణంగా పూజలు, వ్రతాలు చేసేటప్పుడు.. మాంసాహారం తీసుకోవడం నిషిద్ధం.
 
మాంసాహారం తమో, రజో గుణాన్ని ప్రేరేపిస్తుంది. ఆధ్యాత్మిక పరమైన పనులు చేసేటప్పుడు మనస్సు ప్రశాంతంగా వుండాలి. సాత్విక భావనలతో భగవంతుడిని స్మరించాలి. అంతేకాకుండా.. మాంసాహారం జీర్ణమయ్యేందుకు సమయం పడుతుంది. ఆ జీర్ణక్రియ ప్రభావంతో మెదడు తాత్కాలికంగా చురుకుదనాన్ని కోల్పోతుంది.

అందుకే దైవకార్యాలు చేసేటప్పుడు, దైవ దర్శనానికి వెళ్లే ముందు మాంసాహారాన్ని తినతూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఆలయాలకు వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలని పంచశుద్ధితో ఆలయ దర్శనం చేసుకోవాలని వారు చెప్తున్నారు. 
 
శారీర, ఆహార, మానస, వాక్ శుద్ధితో పాటు చేసే పనులు శుద్ధిగా వుండాలి. అలాంటప్పుడే ఆలయ దర్శనం ద్వారా లభించే శుభఫలితాలు దక్కుతాయి. ఇందులో భాగంగానే ఆలయానికి వెళ్లే ముందు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలని, అదీ ఇంట తయారు చేసిన ఆహారాన్ని తీసుకుని దైవ దర్శనం చేసుకోవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుందని వారు చెప్తున్నారు.