సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (17:25 IST)

సుప్రీం ఓకే అంది సరే... ఎంతమంది మహిళలు అయ్యప్ప ఆలయంలోకి వెళ్లేందుకు సిద్ధం?

అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రవేశం నిషేధాన్ని రద్దు చేస్తూ మహిళలందరూ స్వామి సేవలో పాల్గొనవచ్చని తీర్పునిచ్చింది కోర్టు. కోర్టూ తీర్పుపై దేవాలయ ప్రధాన పూజారులు అ

అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రవేశం నిషేధాన్ని రద్దు చేస్తూ మహిళలందరూ స్వామి సేవలో పాల్గొనవచ్చని తీర్పునిచ్చింది కోర్టు. కోర్టూ తీర్పుపై దేవాలయ ప్రధాన పూజారులు అసంతృప్తిని వ్యక్తం చేసినా... కోర్టు తీర్పును శిరసా వహిస్తామని తెలిపారు. అన్ని వయసుల మహిళలందరికీ ఆలయ ప్రవేశాన్ని కల్పిస్తామని చెప్పారు. 
 
కానీ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుకు కట్టుబడి ఆలయంలోని పూజారులు అనుమతించేందుకు అంగీకరించినా ఎంతమంది మహిళలు అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారన్నది ప్రశ్నగా వుంది. ఎందుకంటే.. అయ్యప్ప మాల ధరించిన పురుషులను కనీసం తాకేందుకు కూడా మహిళలు భయపడుతుంటారు. 
 
అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు ప్రయాణించే రైలు భోగీల్లో సైతం మహిళలు చాలా దూరాన్ని పాటిస్తుంటారు. అయ్యప్ప స్వామి పట్ల అంత విశ్వాసం పాదుకుని వుండింది. ఈ నేపధ్యంలో శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లేందుకు ఎంతమంది మహిళలు ఉత్సాహం చూపిస్తారన్నది ప్రశ్నేనని అంటున్నారు చాలామంది. చూడాలి... శబరిమల ఆలయానికి మహిళా భక్తులు తాకిడి ఏ మేరకు వుంటుందో?