బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : సోమవారం, 8 అక్టోబరు 2018 (15:29 IST)

భర్త కోసం శృంగారంలో తృప్తి చెందుతున్నట్లు ముఖం పెట్టేవాళ్లు ఎంతమందో తెలుసా?

ఇదో వింత పరిస్థితి. చాలామంది భార్యలకు ఎదురయ్యే స్థితి. శృంగారంలో భర్త పొందుతున్న సంతోషాన్ని చూసి ఆయన తృప్తి కోసం భార్య కూడా తృప్తి పడుతున్నట్లు ముఖం పెడుట్టడం. శృంగారం ముగిశాక కూడా ఏదో తన్మయత్వం చెందుతున్న ముద్దులు, మురిపాలు.. కానీ అసలు విషయం ఏంటంటే నిజంగా భర్తతో శృంగార సమయంలో కొంతమంది భార్యలు పూర్తిగా తృప్తి చెందటం లేదన్నది. 
 
శృంగారం చివరి దశకు చేరుకుని పురుషుడు దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ ఆ సమయంలో అతడికి కలిగే తృప్తినే భావప్రాప్తి అని పిలుచుకుంటుంటారు. ఇదేవిధమైన తృప్తి స్త్రీలోనూ కలుగుతుందని చాలామంది పురుషులు అనుకుంటారు. కానీ శృంగారం చేసిన సమంయలో భావప్రాప్తికి లోనయ్యే స్త్రీలు కేవలం 29 శాతం అంటున్నారు పరిశోధకులు. మరి ఆ 71 శాతం మంది స్త్రీలు భావప్రాప్తి చెందరా అంటే, వాటికి వేరే చెపుతుంటారు. 
 
స్త్రీ లైంగికంగా కలుసే సమయంలో కంటే ఫోర్ ప్లే సమయంలోనే ఎక్కువ భావప్రాప్తికి లోనవుతుందట. ముఖ్యంగా శృంగారంలో పాల్గొనే ముందు పురుషుడు స్త్రీ ఎద భాగాలను స్పర్శించడం, ముద్దులతో స్పర్శా సుఖాన్ని అందజేయడం, స్త్రీ వ్యక్తిగత భాగంపైన నెమ్మదిగా స్పృశిస్తూ సుఖానుభూతులకు గురిచేయడం వంటి చర్యల్లో ఎక్కడో ఓ దగ్గర భావప్రాప్తికి లోనవతుందట. 
 
అలాగే ఫోర్ ప్లే చేస్తూ శృంగారం చేసే సమయంలోనూ భావప్రాప్తి చెందుతుందని తమ పరిశోధనల్లో తేలిందంటున్నారు పరిశోధకులు. కనుక స్త్రీకి భావప్రాప్తి అనేది కేవలం ఆ చర్య ముగిసినప్పుడే కలుగాలని ఏమీ లేదు.