శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : బుధవారం, 10 అక్టోబరు 2018 (19:47 IST)

శోభనం రోజున దాన్ని తీసి చేతిలో పెట్టింది... చూసి షాక్ తిన్నా...

ఇటీవలి కాలంలో ఇలాంటి సమస్యలతో కొంతమంది యువకులు ప్రస్తావించడం కనబడుతోందంటున్నారు వైద్యులు. వారు వెళ్లడిస్తున్న అనుమానాల్లో ఇది ఒకటి. తను పెళ్లాడిన యువతి మోడ్రన్ కల్చర్లో వున్నదనీ, శోభనం రోజున మాటల మధ్యలో ఓ ప్యాకెట్ బయటకు తీసిందని, అందులో ఉన్న పుస్తకాన్ని తీసి తన చేతిలో పెట్టింది. దాన్ని చూసిన తను షాక్ తిన్నాడు.
 
ఐతే ఆమె మాత్రం ఆ పుస్తకంలో ఉన్న భంగిమలను చూస్తూ చాలా ఎక్జయిట్ అయ్యింది. అలాంటి భంగిమల్లో శృంగారం కావాలని అడుగుతోంది. ప్రతి రోజూ కొత్త భంగిమలో చేయమని అడుగుతోంది. ఇలా ఎందుకు కోరుతుందో అర్థం కావడం లేదు. ఆమెకు వాటిలో అనుభవం ఉందా అనే సందేహం కలగడమే కాకుండా, ఆమెను సంతృప్తిపరచలేక పోతున్నానేమోనని అనుమానం కూడా వస్తోంది. నా అనుమానం ఎంతవరకు నిజమో తెలియడంలేదు అనేది సదరు వ్యక్తి ప్రశ్న.
 
దీనికి వైద్యులు చెప్పే మాట ఏమిటంటే... అవన్నీ అర్థంలేని అనుమానాలు. మీరు సంతృప్తిపరచకుంటే ఆమె మిమ్మల్ని ప్రతిరోజూ ఓ కొత్త భంగిమలో శృంగారం చేయమని కోరదు. రోజుకో కొత్త భంగిమలో చేసుకోలనుకోవడంలో తప్పేమీ లేదు. ఇప్పటి అమ్మాయిలు ఆ పరిజ్ఞానాన్ని అబ్బాయిలతో సమంగానే తెలుసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఆమె అడుగుతుందంటే ముందే అనుభవం ఉందని అనుమానం పెంచుకోవడం మంచిది కాదు. ఇకపోతే కామసూత్రలో కొన్ని భంగిమలు క్లిష్టతరంతో కూడుకున్నవి. వాటిని వేయాలంటే కొంత సాధన అవసరం. అలాంటి వాటి జోలికి వెళ్లకపోవడం మంచిది.