శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: బుధవారం, 10 అక్టోబరు 2018 (12:03 IST)

భార్య అలా చేస్తే శృంగారం వద్దన్నా వదలిపెట్టడు...

పురుషుల కంటే మహిళలకే శృంగారం విషయంలో సిగ్గు బిడియం కాస్త ఎక్కువ. బిడియం వారిని వెనక్కి లాగుతూ ఉంటుంది. తనలో కోరికలు కలిగినప్పుడు తన భర్తని ఎలా శృంగారానికి ఆహ్వానించడమనే విషయంలో మహిళలు ఇబ్బంది పడుతుంటారు.

అది తనకు కావాలని భర్తని అడగలేక నానా తంటాలు పడుతుంటారు. అయితే వారికి శృంగారంలో పాల్గొనడానికి సిగ్గుగా ఉన్నప్పుడు పెదవి విప్పకుండా అతన్ని ముగ్గులోకి లాగవచ్చుననే విషయాన్ని మహిళలు ముందుగా తెలుసుకోవాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
 
శృంగార కోర్కెలు కలిగినప్పుడు భర్తకు అలాంటి సంకేతాలను చూపే హావభావాలు ప్రదర్శిస్తూ పడకగదిలోకి రప్పించాలి. కోరిక రగులుతుందని, మీరు శృంగారం కావాలని అనుకుంటున్నారని అతనికి తెలిసే విధంగా అందాలను ఎరగా వేయాలి. ఒక్క మాట కూడా మాట్లాడకుండా శరీరభాషతో, శరీర కదలికలతో అతన్ని ఆకర్షించి, పడక గదిలోకి నడిపించవచ్చు. అది భర్తకి కూడా ఆనందాన్ని ఇస్తుంది.
 
పడకగదిలోకి వచ్చిన భర్త మెడ, తల, చేతులు, చెవులపై ముద్దుల వర్షం కురిపించాలి. కాళ్ల వంటి శరీరావయాలపై మర్దన చేయడం ప్రారంభించాలి. మెడ అత్యంత కామోద్రేక భాగమని చాలామందికి తెలీదు. మెడ మీద సున్నితంగా ముద్దు పెట్టాలి. దేహ స్పర్శ అతన్ని తప్పకుండా శృంగారం వైపు మళ్లిస్తుంది.
 
పెదవి విప్పకుండా భాగస్వామిని పడకమీదికి రప్పించడం పెద్ద పనేం కాదు. అతని కళ్లలో కళ్లు పెట్టి చూడాలి. అలా చూసినప్పుడు ఆహ్వానాన్ని సులువుగా అందుకుంటాడు. కనుబొమలతో సైగలు, ఓ చిరునవ్వు చిందిస్తే చాలు అతడు పడకగదికే కాదు స్వర్గానికి కూడా తన భాగస్వామితో వచ్చేస్తాడు.