సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: మంగళవారం, 9 అక్టోబరు 2018 (14:11 IST)

కాలేజీ రోజుల్లో వేరొకరితో శృంగారం... ఇప్పుడు మరో సంబంధం.. ఎలా?

కాలేజీ చదువుకునే రోజుల్లో కొంతమంది యువతులకు చేదు అనుభవాలను ఎదురవుతుంటాయి. వయసు తెచ్చే ఆకర్షణకు లోనై ఇష్టమైన అబ్బాయితో స్నేహంగా వుంటూ అది కాస్తా శృంగారానికి దారి తీస్తుంటుంది. వివాహానికి ముందే శృంగారంలోని మజాను అనుభవించడం చాలా ఆనందంగా వున్నప్పటికీ దాని పర్యవసానం చవిచూసేటప్పుడు మాత్రం మనోవేదనకు గురిచేస్తుంది.
 
ఎందుకంటే... ఆకర్షణకు లోనై ఇద్దరు కలిసి చేసే శృంగారం వివాహానికి దారి తీసే అవకాశాలు చాలా తక్కువ. పైగా పెద్దలకు తమ విషయాన్ని చెబితే ఏం చేస్తారోనన్న భయంతో ఆ బంధాన్ని అక్కడే వదిలేసుకుంటారు చాలామంది. అలా వేరే వ్యక్తితో పెళ్లయ్యాక తెలుస్తుంది అసలు సంగతి. వివాహానికి ముందే పాల్గొన్న అమ్మాయి/అబ్బాయి కావాలని మనసు కొట్టుమిట్టాడుతుంటుంది. కానీ.. ఏమీ చేయలేని పరిస్థితి.
 
ఇంకోవైపు పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొనే యువతుల్లో వేరే భయం పట్టుకుంటుంది. తను కన్యను కాదనే విషయం భర్తకు తెలిసిపోతుందేమోనన్న బెంగలో వుంటారు. ఇలా పెళ్లికి ముందు శృంగారం అనేది అనేక అనర్థాలను తెస్తుంది. కాబట్టి ప్రేమించుకునేవారు ధైర్యంగా ఆ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పేసి పెళ్లితో ఏకమవడం అన్నివిధాలా మంచిది.