శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (15:05 IST)

ఎంగేజ్మెంట్ అయింది... అతడితో శృంగారంలో పాల్గొంటుందేమోనని భయం...

ఇప్పుడు ఇలాంటి భయంతో చాలామంది తల్లిదండ్రులు వుంటున్నారు. నిజానికి పెళ్లికి ముందే డేటింగ్ అనేది అక్కడక్కడ వింటూనే వున్నాం.

ఇప్పుడు ఇలాంటి భయంతో చాలామంది తల్లిదండ్రులు వుంటున్నారు. నిజానికి పెళ్లికి ముందే డేటింగ్ అనేది అక్కడక్కడ వింటూనే వున్నాం. ఐతే సంప్రదాయం ప్రకార నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాతే నవ దంపతుల శృంగారం. కానీ ఎంగేజ్మెంట్ అలా అయ్యిందో లేదో కపుల్స్ జాలీగా ట్రిప్పులేయడం ఇప్పుడు మామూలుగా కనబడుతోంది. 
 
నిశ్చితార్థం ముగియగానే కుమార్తె అలా కాబోయే అల్లుడితో తిరుగుతుందని తెలిసి కక్కలేక మింగలేక తమలో తాము కుమిలిపోతుంటారు తల్లిదండ్రులు. నిశ్చితార్థం జరిగిన వెంటనే వారిద్దరు చాలా చనువుగా తిరగటం, ఒకరినొకరు హగ్ చేసుకోవడం వంటివి కూడా జరిగిపోతున్నాయి. దీంతో ఇలా తిరుగుతున్న జంట వివాహానికి ముందే లైంగికంగా కలుస్తారేమోనని బెంగలో పేరెంట్స్ వుంటున్నారు. జాగ్రత్తగా వుండాలని కుమార్తెతో చెప్పలేక చూస్తూ వుండిపోయేవారు మరికొందరు. 
 
కానీ ఇటీవలి కాలంలో నిశ్చితార్థం అయిన తర్వాత తనకు కాబోయే భర్తతో చనువుగా మాట్లాడుకోవడం, వీలు దొరికితే సినిమాలు, షికార్లకు వెళ్లడం ఈ కాలంలో సర్వసాధారణం. అంతమాత్రానా వారు లైంగిక సంబంధం పెట్టుకుంటారన్న బెంగ అవసరంలేదు. ఇలా చనువుగా వుండటం వల్ల కాబోయే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు అవకాశం కుదురుతుంది. 
 
కుమార్తె పెళ్లికి ముందే తొందరపడుతుందా లేదా అనేది పెంపకంపై ఆధారపడి వుంటుంది. ఒకవేళ అలా చేస్తే దానివల్ల వచ్చే ఇబ్బందులు అమ్మాయే భరించాల్సి ఉంటుంది కనుక ఆ విషయాలు ఇతరుల జీవితాలను ఉదాహరణగా చూపుతూ చెబితే పిల్లలు అర్థం చేసుకుంటారు. అలా పరోక్షంగా అమ్మాయిలను హెచ్చరిస్తే జాగ్రత్తపడతారు.