1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: బుధవారం, 26 సెప్టెంబరు 2018 (17:16 IST)

భార్య భగవంతుడి సేవలో... భర్త శృంగార యావతో... ఎలా?

భక్తి అనేది ఇటీవలి కాలంలో చాలామంది గృహిణుల్లో ఎక్కువగా కనిపిస్తోందన్న మాట నిజం. వారంలో ఎన్ని రోజులు ఎలాంటి వ్రతాలు, పూజలు చేస్తారో అన్నింటిని చేస్తుంటారు గృహిణులు. ఐతే కొంతమంది మాత్రం పూర్తిగా దైవ చింతనలో పడిపోయి... భర్త రాత్రివేళ శృంగార సంబంధ విషయాల

భక్తి అనేది ఇటీవలి కాలంలో చాలామంది గృహిణుల్లో ఎక్కువగా కనిపిస్తోందన్న మాట నిజం. వారంలో ఎన్ని రోజులు ఎలాంటి వ్రతాలు, పూజలు చేస్తారో అన్నింటిని చేస్తుంటారు గృహిణులు. ఐతే కొంతమంది మాత్రం పూర్తిగా దైవ చింతనలో పడిపోయి... భర్త రాత్రివేళ శృంగార సంబంధ విషయాలు మాట్లాడినా వాళ్ల నోరు మూసేస్తున్నారన్న ఫిర్యాదులు ఇటీవలి కాలంలో మానసిక శాస్త్ర వైద్యుల వద్దకు వస్తున్నాయట. ఈ పరిస్థితి నుంచి వారిని బయటకు రప్పించేందుకు కౌన్సిలింగ్ ఇప్పించాల్సి వస్తోందట.
 
ఇక అసలు విషయానికి వస్తే... దైవభక్తికి సంబంధించిన ఆధ్యాత్మికత, దాంపత్య సుఖాన్ని ఇచ్చే శృంగారం భిన్నమైనవనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనకు శృంగార కోర్కెలు అడ్డంకి అనుకుంటారు. అయితే దైవభక్తి ఎంత సహజమో, శృంగార కోర్కెలూ అంతే సహజం. ఆ రెండూ మనసుకు సంబంధించినవే. 
 
జీవితం మనకు అనేక అనుభవాలనిస్తుంది. అన్నిరకాల అనుభవాల్ని అనుభవించాలేగాని కొన్నింటిని అదిమిపెట్టడం సరైంది కాదు. శృంగార కోర్కెలు ప్రకృతి సహజమైనవి. వాటిని అదిమిపెట్టడమంటే ప్రకృతికి వ్యతిరేకంగా పోరాడటమే. కాబట్టి భక్తిగా భగవంతుడిని పూజించడం ఎంత ముఖ్యమో జీవితంలో మిగిలిన పార్శ్వాలకు కూడా న్యాయం చేయడం కూడా అవసరం అని గ్రహించాలి.
 
సెక్స్ కూడా ఆధ్యాత్మిక చింతనలో భాగం చేసుకుని ముందుకు వెళ్లాలి. మనసులోని అపరాధ భావాన్ని తొలగించుకుని ఉపక్రమిస్తే ఉత్సాహవంతమైన సెక్స్ సుఖం సొంతమవుతుంది.