శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 26 సెప్టెంబరు 2018 (10:27 IST)

ఆరు నెలలకోసారి వచ్చే భర్త నాకొద్దు... చంపేద్దాం... ప్రియుడితో కలిసి...

సంపాదన కోసం పొట్టచేత పట్టుకుని చాలామంది విదేశాలకు వెళుతుంటారు. స్వదేశంలో తన కుటుంబం ఆర్థికంగా స్థిరపడాలని కలలు కంటారు. వాటిని నిజం చేసుకునేందుకు విదేశాలకు వెళుతుంటారు కొందరు. ఐతే వీరిలో కొంతమంది అక్కడే వేరేవారితో వివాహేతర సంబంధం సాగించడమో లేదంటే ఇక్క

సంపాదన కోసం పొట్టచేత పట్టుకుని చాలామంది విదేశాలకు వెళుతుంటారు. స్వదేశంలో తన కుటుంబం ఆర్థికంగా స్థిరపడాలని కలలు కంటారు. వాటిని నిజం చేసుకునేందుకు విదేశాలకు వెళుతుంటారు కొందరు. ఐతే వీరిలో కొంతమంది అక్కడే వేరేవారితో వివాహేతర సంబంధం సాగించడమో లేదంటే ఇక్కడివారిలో కొందరు అక్రమ సంబంధం కొనసాగించడం వంటి సంఘటనలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. అవి కాస్తా హత్యలకు దారి తీస్తున్నాయి.
 
తాజాగా తమిళనాడులోని దిండుగల్ సమీపంలో లభ్యమైన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కేసును పరిశీలించిన పోలీసులు కారణం వివాహేతర సంబంధమని తేల్చారు. వివరాలను చూస్తే... తేని జిల్లా దేవదానపట్టికి సమీపంలోని పర్వత ప్రాంతంలో సెప్టెంబరు 18న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అతడిని ఎవరో గొంతు కోసి హత్య చేసినట్లు గుర్తించారు.
 
మరింత లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు హతుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన 32 ఏళ్ల మహ్మద్‌ సమీర్ అని తేలింది. తన భార్య ప్రదోష్‌తో ఇక్కడికి అతడు విహార యాత్రకు వచ్చాడు. ఆరు నెలలకు ఓసారి ఇలా భార్య వద్దకు వచ్చి ఏదో ఒక పర్యాటక ప్రాంతాన్ని ఎంచుకుని విహార యాత్ర చేస్తుంటాడు. ఇందులో భాగంగా అతడు తన భార్యతో వచ్చినట్లు తేలింది. ఐతే అతడి భార్య మంగుళూరుకి చెందిన మహ్మద్‌తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుండటంతో ఆరు నెలలకోసారి వచ్చే భర్త అడ్డు తొలగించి ఇతడిని పెళ్లాడాలని ప్లాన్ చేసింది. అనుకున్నట్లుగా భర్తను నమ్మించి విహార యాత్రకు తీసుకొచ్చి అతడిని హతమార్చి ప్రియుడితో సహా పారిపోయింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.