శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 26 సెప్టెంబరు 2018 (15:34 IST)

రూ.500 బాకీ.. స్నేహితుడి భార్యను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు.. గర్భం కూడా?

బాకీ తీర్చనందుకు స్నేహితుడి భార్యను ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు. అంతేగాకుండా.. ఆమె గర్భం దాల్చింది. ఈ ఘటన బెళగావిలో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బసవరాజ్, రమేశ్ అనే ఇద్దరు వ్యక్తులు షాహాపూ

బాకీ తీర్చనందుకు స్నేహితుడి భార్యను ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు. అంతేగాకుండా.. ఆమె గర్భం దాల్చింది. ఈ ఘటన బెళగావిలో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బసవరాజ్, రమేశ్ అనే ఇద్దరు వ్యక్తులు షాహాపూర్‌లోని హోటల్‌లో సప్లయర్లుగా పనిచేస్తున్నారు. ఒకే చోట పనిచేస్తుండటంతో ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. బసవరాజు భార్య పార్వతి కూడా అదే హోటల్‌లో పనిచేస్తోంది. వీరికి మూడేళ్ల పాప కూడా ఉంది. 
 
కానీ ఇంతలో బసవరాజు తన వద్ద తీసుకున్న రూ.500 బాకీ తీర్చనందుకు.. అతని భార్య పార్వతిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. దీంతో రమేశ్, పార్వతిని పుట్టింటికి పంపాడు. ఈ ఘటనపై బసవరాజు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో మంగళవారం బెళగావి డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగాడు. 
 
తన భార్య రమేశ్‌ వద్ద రెండు నెలలుగా ఉంటోందని.. పార్వతిని తన వద్దకు పంపాలని ఎన్నిసార్లు గొడవ పెట్టుకున్నా అతను వినడం లేదని.. మరోసారి పార్వతి గురించి అడిగితే చంపుతానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.