మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: బుధవారం, 26 సెప్టెంబరు 2018 (09:28 IST)

కేటిఆర్ గురించి.. రాజ‌కీయాల గురించి క్లారిటీ ఇచ్చిన నాగ్..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున రాజ‌కీయాల్లోకి రానున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. కొన్ని న్యూస్ ఛాన‌ల్స్‌లో అయితే.. నాగార్జున టీఆర్ఎస్ త‌రుపున పోటీ చేయ‌నున్నార‌ని వార్త‌లు ప్ర‌సారం చేస్తే.. మ‌రికొన్ని ఛాన‌ల్స్ వైఎస్సార్ త‌రుపున ఆంధ్

టాలీవుడ్ కింగ్ నాగార్జున రాజ‌కీయాల్లోకి రానున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. కొన్ని న్యూస్ ఛాన‌ల్స్‌లో అయితే.. నాగార్జున టీఆర్ఎస్ త‌రుపున పోటీ చేయ‌నున్నార‌ని వార్త‌లు ప్ర‌సారం చేస్తే.. మ‌రికొన్ని ఛాన‌ల్స్ వైఎస్సార్ త‌రుపున ఆంధ్రాలో పోటీ చేయ‌నున్నార‌ని వార్త‌లు ప్ర‌సారం చేసాయి. ఇదిలా ఉంటే... నాగ్ నానితో క‌లిసి న‌టించిన చిత్రం దేవ‌దాస్. ఈ నెల 27న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది.
 
ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన నాగ్‌ని మీకు కేటీఆర్ మంచి ఫ్రెండ్ క‌దా. అందుచేత మీరు రాజ‌కీయాల్లోకి రానున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి నిజ‌మేనా అని అడిగితే... కేటిఆర్ నాకు మంచి ఫ్రెండ్. ఆ ఫ్రెండ్‌షిప్ అలాగే ఉంటుంది. అయితే.. నేను రాజ‌కీయాల్లోకి వస్తున్నాను అని మీడియా అనుకుంటుంది నేను అనుకోవ‌డం లేద‌న్నారు. అక్కినేని రాజ‌కీయాల‌కు దూరంగానే ఉన్నారు. అలాగే నాగ్ కూడా రాజ‌కీయాల‌కు దూరం. ఇందులో ఎలాంటి సందేహం లేద‌న్న‌మాట‌.