శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By srinivas
Last Modified: సోమవారం, 17 సెప్టెంబరు 2018 (19:49 IST)

వైసీపీలో వంగవీటి ముసలం... రాధా పార్టీ మారతారా?

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి పోటీకి దిగేందుకు సిద్ధమవుతున్న వంగవీటి రాధా ఆశలపై వైసీపీ అధిష్ఠానం నీరు చల్లిందా? అంటే అవుననే సమాధానాలు వినపడుతున్నాయి. మల్లాది విష్ణుకు సెంట్రల్‌ పగ్గాలు అప్పగించేందుకు అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు వెలువడు

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి పోటీకి దిగేందుకు సిద్ధమవుతున్న వంగవీటి రాధా ఆశలపై వైసీపీ అధిష్ఠానం నీరు చల్లిందా? అంటే అవుననే సమాధానాలు వినపడుతున్నాయి. మల్లాది విష్ణుకు సెంట్రల్‌ పగ్గాలు అప్పగించేందుకు అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఆదివారం విజయవాడలో జరిగిన వైసీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం దీనికి వేదిక అయ్యింది. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో వంగవీటి రాధా, మల్లాది విష్ణు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించడంతో, ఈ సమావేశంలో గ్రూపు రాజకీయాలకు సంబంధించి చర్చ జరిగినట్టు సమాచారం.
 
సెంట్రల్‌ నియోజకవర్గ బాధ్యతలను మల్లాది విష్ణుకు దక్కేలా గడప గడపకు వైసీపీ కార్యక్రమం ప్రారంభించమని విష్ణుకు సూచించారు వైసీపీ పెద్దలు. వంగవీటి రాధాను సెంట్రల్‌ అసెంబ్లీ నియోజకవర్గంపై కాకుండా మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంపై దృష్టి సారించాలని చెప్పడంతో రాధా తీవ్రంగా వ్యతిరేకించి, సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. విజయవాడ సెంట్రల్ టిక్కెట్ వంగవీటి రాధకు ఇవ్వకపోవడంపై అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు ఉయ్యూరు కౌన్సిల్, జిల్లా ఫ్లోర్ లీడర్ పదవులకు వంగవీటి శ్రీనివాస ప్రసాద్ రాజీనామా చేశారు. వంగవీటి రాధాకృష్ణ కుటుంబ సభ్యుల, అనుచరులు, పార్టీ నేతలతో వంగవీటి రాధా పలుదఫాలు చర్చలు జరుపుతున్నారు.
 
ఇదిలాఉంటే వంగవీటికి టచ్‌లోకి టీడీపీ ముఖ్యులు వెళ్లినట్టు సమాచారం. వంగవీటి అసంతృప్తి నేపధ్యంలో సంప్రదింపులు జరిపి రాధాను పార్టీలోకి తెచ్చేందుకు టీడీపీ ప్రయత్నాలు చేపట్టినట్లు తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే టీడీపీ సిట్టింగ్ సీటు కావడంతో తెలుగుదేశం ఎలా డీల్ చేస్తుందో చూడాలి
 
 మరి. రాధా ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.. రాధా ఏం నిర్ణయం తీసుకున్నా తామంతా రాధా వెంటే ఉంటామని చెబుతున్నారు రంగా రాధా అభిమానులు.