గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 13 సెప్టెంబరు 2018 (11:52 IST)

అరుణ్ జైట్లీకి చెప్పాకే లండన్‌కు వచ్చా : విజయ్ మాల్యా

కేంద్ర ఆర్థిక మంత్రి విజయ్ మాల్యాకు చెప్పిన తర్వాతే తాను లండన్‌కు వచ్చినట్టు ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం వదిలి వెళ్లిపోయే ముందు అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ఆయన

కేంద్ర ఆర్థిక మంత్రి విజయ్ మాల్యాకు చెప్పిన తర్వాతే తాను లండన్‌కు వచ్చినట్టు ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం వదిలి వెళ్లిపోయే ముందు అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ఆయన్ను చాలా సార్లు కలిశానని తెలిపారు.
 
దేశంలోని పలు బ్యాంకుల నుంచి వేల కోట్లాది రూపాయల మేరకు రుణాలు తీసుకున్న విజయ్ మాల్యా వాటిని తిరిగి చెల్లించలేక విదేశాలకు పారిపోయిన విషయం తెల్సిందే.
 
మాల్యా కేసు విచారణ జరుగుతున్న లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ కోర్టు బయట ఆయన విలేకరులతో మాట్లాడారు. 'రుణాలను తిరిగి బ్యాంకులకు చెల్లించేందుకు అరుణ్‌ జైట్లీకి నేను చాలా మార్గాలు చెప్పాను. ఇది నిజం' అని ఆయన విలేకరులతో అన్నారు.