సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (09:31 IST)

ఎల్జీబీటీ అంటే ఏంటి? ఎవరు గే.. ఎవరు లెస్బియన్?

భారత చరిత్రలో గురువారం శాశ్వతంగా నిలిచిపోతుంది. స్వలింపర్కం నేరం కాదంటూ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీం తీర్పుతో దేశ వ్యాప్తంగా ఎల్జీబీటీ కమ్యూనిటీ సంబరాలు చేసుకుంటో

భారత చరిత్రలో గురువారం శాశ్వతంగా నిలిచిపోతుంది. స్వలింపర్కం నేరం కాదంటూ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీం తీర్పుతో దేశ వ్యాప్తంగా ఎల్జీబీటీ కమ్యూనిటీ సంబరాలు చేసుకుంటోంది. అసలు ఎల్జీబీటీ అంటే ఏమిటి? ఎవరు గే, ఎవరు లెస్బియన్, ఎవరు బైసెక్సువల్, ఎవరు ట్రాన్స్‌జెండర్, వీళ్లందరికీ మధ్య ఉండే తేడాలేంటో చాలామందికి తెలీదు.
 
ఎల్ అంటే లెస్బియన్:
లెస్బియన్ అంటే ఒక స్త్రీకి మరో స్త్రీ పట్ల ప్రేమ కలగడం. లెస్బియన్లలో ఒకరు పురుషుల్లా ఉంటారని, జుట్టు కత్తిరించుకుని, ప్యాంటుషర్టు వేసుకుంటారని అనుకుంటారు. వాళ్లను బుచ్ అని పిలుస్తారు. ఇక రెండో పార్ట్‌‍నర్‌‍లో ఆడలక్షణాలు ఉంటాయని, వాళ్లు చీర కట్టుకుంటారని, వాళ్ల హావభావాలు కూడా ఆడవాళ్లలా ఉంటాయని అనుకునేవాళ్లు. వాళ్లను ఫెమ్ అని పిలుస్తుంటారు. అయితే లెస్బియన్లలో.. ఎవరి హావభావాల్లో అయినా, ఎలాంటి లక్షణమైనా కూడా ఉండొచ్చు.
 
జి అంటే గే :
గే అంటే ఒక మగాడికి మరో మగాడిపై  ప్రేమ కలగడం. గే అనే పదాన్ని ఇప్పుడు అన్ని వర్గాలు.. అంటే గే, లెస్బియన్, బైసెక్సువల్.. వీళ్లందరినీ కలిపి ఇప్పుడు గే అనే పదంతోనే పిలుస్తున్నారు.
 
బీ అంటే బైసెక్సువల్ :
బైసెక్సువల్ అంటే ఎవరికైనా, ఎవరి పట్ల అయినా ఆకర్షణ కలగవచ్చు. ఒక మగాడికి మరో మగాడిపై ప్రేమ కలగొచ్చు, లేదా స్త్రీపై ప్రేమ కలగొచ్చు. అలాగే ఒక స్త్రీకి మరో స్త్రీ పై లేదా మగాడిపై ప్రేమ కలగవచ్చు.
 
టీ అంటే ట్రాన్స్‌‍జెండర్ :
ట్రాన్స్‌జెండర్ అంటే మూడో జెండర్‌కి చెందిన వ్యక్తి. పుట్టినపుడు వీళ్లను మగపిల్లలో, ఆడపిల్లలో అనుకుంటారు. కానీ పెద్దయ్యాక వాళ్లు భిన్నంగా తయారవుతారు. మగాడిగా పుట్టిన వ్యక్తిలో పెద్దయ్యాక ఆడపిల్ల లక్షణాలు బైటపడవచ్చు, ఆడపిల్లగా పుట్టిన వ్యక్తిలో పెద్దయ్యాక మగాడి లక్షణాలు కనిపించవచ్చు. ట్రాన్స్‌జెండర్ల మనసులో ఉండే ఆలోచన వాళ్ల దుస్తుల రూపంలో కనిపిస్తుంది. 
 
కొంతమంది తమ ఆలోచనలతో పాటుగా శరీరం కూడా మారాలని అనుకుంటారు. ఆపరేషన్ ద్వారా తమ శరీర అవయువాల్లో మార్పులు చేసుకుంటారు. భారతదేశంలో మాత్రం వీళ్లు 'హిజ్రా'లు అనే పేరుతోనే అందరికీ తెలుసు. హిజ్రా, అరావనీ, కోథీ, శివశక్తి, జోగ్తి హిజ్రా.. ఇలా దేశంలో వేర్వేరు ప్రాంతాలలో వీళ్లను వేర్వేరు పేర్లతో పిలుస్తారు.