శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (18:32 IST)

పేటిఎం మనీ డౌన్లోడ్ చేసుకోండి... '0' ఛార్జ్‌తో మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టండి

బెంగళూరు: పేటిఎం మనీ లిమిటెడ్- భారత దేశపు అతి పెద్ద మొబైల్ చెల్లింపు వేదిక, పేటిఎం ద్వారా సంపూర్ణంగా స్వంతం కాబడినది, ఈ రోజు, భారతదేశంలో తదుపరి 3 నుండి 5 సంవత్సరాలలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ బేస్‌ను రెట్టింపు చేసుకోవాలనే లక్ష్యంతో మ్యూచువల్ ఫండ్ పెట

బెంగళూరు: పేటిఎం మనీ లిమిటెడ్- భారత దేశపు అతి పెద్ద మొబైల్ చెల్లింపు వేదిక, పేటిఎం ద్వారా సంపూర్ణంగా స్వంతం కాబడినది, ఈ రోజు, భారతదేశంలో తదుపరి 3 నుండి 5 సంవత్సరాలలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ బేస్‌ను రెట్టింపు చేసుకోవాలనే లక్ష్యంతో మ్యూచువల్ ఫండ్ పెట్టుబదుల కొరకు తన అంకితమైన ఆప్(ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ పైన) ఆవిష్కరణను ప్రకటిస్తోంది.
 
పేటిఎం అనేది వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ నుండి 4వ వినియోగదారు బ్రాండ్‌గా ఉంది మరియు ఇది భారతదేశంలోని టెక్ రాజధాని బెంగళూరులో హెడ్ క్వార్టర్స్ కలిగి ఉండి స్వతంత్రంగా కార్యకలాపాలను స్క్రాచ్ నుండి నిర్మించబడాలనదే దీని మొట్టమొదటి పని. వ్యాపార సంస్థ, పెట్టుబడులు నిర్మించడానికి మరియు సంపద నిర్వహణా ఉత్పత్తులు మరియు సేవలపై దృష్టి సారిస్తుంది.
 
భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ అంతగా ప్రభావం లేకపోవడం వలన, పేటిఎం మనీ ఇదివరకే తన ఆవిష్కరణకు ముందుగా 8,50,000 యూజర్లను నమోదు చేయడంతో ఒక అతిపెద్ద వినియోగదారు ఆసక్తిని పెంపొందించింది. 96% కంటే ఎక్కువ రిజిస్టేషన్స్ మొబైల్ పరికరాల నుండి చేయబడ్డాయి మరియు కంపెనీ తన ఆవిష్కరణకు ఆప్-ద్వారా మాత్రమే ఎంచుకుంటొంది. ఈ రిజిస్ట్రేషన్స్‌లో 65%కు పైగా, బి15 (టాప్ 15 నగరాల ఆవల) నుండి నమోదు చేయబడ్డాయి, పేటిఎం మనీ, చిన్న నగరాలకు మరియు మారుమూల పట్టణాలకు సంపద సృష్టి అవకాశాలను తీసుకురావాలని ఆశిస్తూంది.
 
పేటిఎం మనీ ఆప్ అనేది ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ రెండింటిపైన, సెప్టెంబర్ 04, 2018 నుండి డౌన్లోడ్ కొరకు అందుబాటులో ఉంటుంది. ఈ కంపెనీ ఒకరోజుకు, 2,500+ యూజర్స్‌కు వీలు కల్పిస్తుంది మరియు తదుపరి కొన్ని వారాలలో 10,000+ యూజర్స్‌కు పెంచబడుతుంది. యూజర్స్‌కు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ చిరునామాపై ఈ ప్రాప్యత గురించి తెలుపబడుతుంది. పేటిఎం మనీ అనేది యూజర్స్ తమ సంపూర్ణ డిజిటల్ కెవైసిని పూర్తి చేయడానికి వీలుకల్పిస్తుంది మరియు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు తన ఆప్‌లో వేగవంతమైన ప్రవేశం కల్పిస్తుంది. దీని బృదం, తన ప్రారంభక యూజర్స్‌తో సన్నిహితంగా పనిచేస్తూ, ఈ సర్వీసును అందరికీ అందుబాటులో తీసుకువచ్చే ముందుగా అభిప్రాయాలను, సూచనలను కోరుతుంది.
 
ఈ కంపెనీ, జీరో పంపిణీ ఫీజు లేదాకమిషన్స్ వలన తక్కువ ఖర్చు నిష్పత్తులతో వచ్చే మ్యూచువల్ ఫండ్స్ యొక్క ప్రత్యక్ష ప్రణాళికలను అందించడానికి 90% పరిశ్రమలోని ఎయుఎం (అసెట్ అండర్ మేనేజ్మెంట్)ను కవర్ చేస్తూ 25 ఎఎంసిల (అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. యూజర్లు కొంత మొత్తాన్ని లేదా ఎస్‌ఐపిల ద్వారా అతి తక్కువగా రూ.100లను కొన్ని పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. పేటిఎం మనీ, ప్రముఖ రేటింట్ సర్వీసులతో ఒప్పందం చేసుకుంది. మార్నింగ్ స్టార్, సిఆర్‌ఐఎస్‌ఐఎల్ మరియు వేల్యూ రీసర్చ్‌లతో పెట్టుబడి నిర్ణయం తీసుకునే ప్రక్రియ కోసం చేసుకుంది. ఈ సర్వీసు తమ యూజర్స్ కోసం పూర్తిగా ఉచితం.
 
“సంపద సృష్టించగల అవకాశాలకు ప్రాప్యత ఈరోజు వరకు కేవలం కొంతమందికే లభిస్తోంది. పేటిఎం మనీతో, మేము ప్రజాస్వామికంగా ఉండి, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను మిలియన్ల కొద్దీ భారతీయులకు అందించాలని అనుకుంటున్నాము. భారతదేశంలోని మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారు బేస్‌ను తదుపరి 5 సంవత్సరాలలో 50 మిలియన్ వరకు తీసుకెళ్లాలని మరియు ఈ పరిశ్రమకు కొత్త ఇంక్రిమెంటల్ పెట్టుబడిదారులలో ఒక ఉత్ప్రేరకంగా ఉండాలని పేటిఎం మనీ ఆశిస్తోంది.” అని విజయ శేఖర్ శర్మ, పేటిఎం యొక్క ఫౌండర్ మరియు సిఇఓ అన్నారు.
 
ప్రవీణ్ జాధవ్, పేటిఎం మనీ యొక్క పూర్తి సమయ డైరెక్టర్ ఇలా అన్నారు, “మేము అందుకున్న అసాధారణ ఆసక్తిని మేము నిజంగా ఎంతో గౌరవంగా భావిస్తున్నాము. పేటిఎం మనీతో, భారతదేశం యొక్క విశ్వసనీయమైన ఎఎంసిలు మరియు ఫండ్ మేనేజర్స్‌ను అనుసంధానించి, పెట్టుబడి ప్రక్రియను సరళంగా, పారదర్శకంగా మరియు పెట్టుబడిదారులకు పూర్తిగా ఉచితంగా అందించడమే మా పాత్ర. మేము, పెట్టుబడి సలహా మరియు అమలు సేవలు రెండూ అందించే, పూర్తి వివరమైన రిస్క్ ప్రూఫింగ్ కోసం ఒక సాంకేతిక-ఆధారిత వేదికను నిర్మిస్తున్నాము మరియు యూజర్స్ ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అందుబాటులో ఉన్న సమాచారమంతా అందింస్తున్నాము.”
 
ఆయన ఇంకా ఇలా అన్నారు, “మేము పేటిఎం మనీలో చేసే ప్రతిదానికి సాంకేతికత ప్రధానమైనది. పెట్టుబడి మరియు సంపద మేనేజ్మెంట్ డొమైన్లో సంపూర్ణ సాంకేతిక వేదికను నిర్మించిన ఏకైక కంపెనీ బహుశా మాదే కావచ్చు. ఇది అన్ని ఎఎంసిలకు రియల్ టైమ్‌లో లావాదేవీలను పోస్ట్ చేయడానికి, మ్యూచువల్ ఫండ్ పథకం ఎన్ఎవిలకు వేగవమ్తమైన అప్డేట్స్‌ను పొందడానికి, అత్యంత అప్డేట్ చేయబడిన పోర్ట్ ఫోలియో విలువను ప్రదర్శించడానికి, రియల్ టైం పోర్ట్ ఫోలియో ఇన్‌సైట్స్ ఏర్పరచడానికి, రియల్ టైమ్ సవరింపు వ్యవస్థల ద్వారా పర్యవేక్షించడం మరియు మరెన్నో చేయడానిక్ మాకు సామర్థ్యాలను ఇస్తుంది. రోజుకు ఒక మిలియన్ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు పైగా నిర్వహించడానికి మా వేదిక నిర్మించబడింది.”
 
చిన్న పట్టణాలలో మరియు నగరాలలో విస్తృత స్వీకారాన్ని నడపడానికి, పేటిఎం మనీ, ఆటో పే ఇ-మ్యాండేట్స్, ఫిజికల్ మ్యాండేట్స్ మరియు నెట్ బ్యాంకింగ్ ద్వారా 190+ బ్యాంకులలో పెట్టుబడి పెట్టడానికి పేటిఎం మనీ తోడ్పడుతుంది. దీని ఉన్నత అంశాల ఆండ్రాయిడ్ ఆప్ అనేది ఈ విభాగంలో అతి తేలికైన ఆప్స్ లో ఒకటిగా కూడా ఉంది.  ఈ కంపెనీ తన ఉత్పత్తిని, డిజైన్ ను, డేటా సైన్స్ ను మరియు యంత్ర శిక్షణను, యూజర్ యొక్క రిస్క్ అంచనాను విశ్లేషించడానికి, సలహా పోర్టిఫోలియోలను సిఫారసు చేయడానికి మరియు వ్యక్తిగత యూజర్ కు సమయానుసారంగా ఉత్తమంగా సరిపోయే పెట్టుబడుల సిఫారసుల కొరకు మరింత పెట్టుబడి పెట్టుటకు ప్రణాళిక చేస్తోంది.
 
ఈ సంవత్సరం తొలినాళ్ళలో ఈ కంపెనీ, ఇన్వెస్ట్మెంట్ సలహాదారు(ఐఎ)గా వ్యవహరించుటకు సెబి నుండి ఆమోదం పొందింది మరియు పెట్టుబడి సలహాదారు మరియు అమలుపరచు సేవలను అందించుట లక్ష్యంగా కలిగి ఉంది. పేటిఎం మనీ, ఒక పూర్తి స్థాయి పెట్టుబడి మరియు సంపద నిర్వహణ కంపెనీగా ఏర్పడడాన్ని లక్ష్యంగా కలిగి ఉంది. పేటిఎంమనీ, బెంగళూరులో తన హెడ్ క్వార్టర్స్‌ను కలిగి ఉండి కార్యకలాపాలను నిర్వహిస్తోంది; దీని 100+ సభ్యుల జట్టుకు పూర్తి స్థాయి డైరెక్టర్, ప్రవీణ్ జాధవ్ గారు నాయకత్వం వహిస్తున్నారు. ఈ కంపెనీ తన మాతృ కంపెనీ అయిన వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ నుండి తన కార్యకలాపాల ఏర్పాటు కొరకు $10 మిలియన్ల పెట్టుబడి ఒప్పందాన్ని అందుకుని ఉంది.