రవిశాస్త్రి ఓ అజ్ఞాని... సౌరవ్ గంగూలీ ఫైర్

భారత క్రికెట్ జట్టు కోచ్ రవిశాస్త్రిపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుతమున్న భారత క్రికెట్ జట్టే అత్యుత్తమమని, గతంలో ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఎక్కువ విజయాలన

ganguly
pnr| Last Updated: ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (13:47 IST)
భారత క్రికెట్ జట్టు కోచ్ రవిశాస్త్రిపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుతమున్న భారత క్రికెట్ జట్టే అత్యుత్తమమని, గతంలో ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఎక్కువ విజయాలను మరే జట్టూ సొంతం చేసుకోలేదని కోచ్ రవిశాస్త్రి తాజాగా వ్యాఖ్యానించారు.
 
ఈ వ్యాఖ్యలపై గంగూలీ మండిపడ్డారు. రవిశాస్త్రి అజ్ఞానంతో ఈ వ్యాఖ్యలు చేశాడని ఆరోపించాడు. అన్ని తరాల క్రికెటర్లూ దేశం కోసమే ఆడాయన్న విషయాన్ని ఆయన మరచి పోయినట్టున్నాడని మండిపడ్డాడు. తనతో పాటు చేతన్ శర్మ, ధోనీ వంటి వాళ్లం ఎంతో క్రికెట్ ఆడామని, ఇప్పుడు కోహ్లీ కూడా అలా ఆడుతున్నవాడేనని గంగూలీ గుర్తుచేశారు. 
 
ఒక తరం క్రికెటర్లను, మరో తరం క్రికెటర్లను పోల్చడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఈ తరహా వ్యాఖ్యలు రవిశాస్త్రి చేయడం మంచిపద్ధతి కాదని హితవు పలికాడు. కాగా, రవిశాస్త్రి వ్యాఖ్యలపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సైతం మండిపడ్డ సంగతి తెలిసిందే. ఈ తరహా వ్యాఖ్యలు సీనియర్ క్రికెటర్లను కించపరిచినట్టుగా ఉంటాయన్నారు. 



దీనిపై మరింత చదవండి :