శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 6 సెప్టెంబరు 2018 (16:17 IST)

టెస్టు క్రికెట్‌లో చోటు ఇవ్వట్లేదు.. కోహ్లీపై అలిగిన రోహిత్ శర్మ

సంప్రదాయ టెస్టు క్రికెట్‌లో ఆడే జట్టులో తనకు చోటు ఇవ్వకపోవడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అలిగినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

సంప్రదాయ టెస్టు క్రికెట్‌లో ఆడే జట్టులో తనకు చోటు ఇవ్వకపోవడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అలిగినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

అంతేగాకుండా రోహిత్ శర్మ, కోహ్లీల మధ్య విబేధాలు తలెత్తినట్లు ఇప్పటికే క్రికెట్ అభిమానుల్లో చర్చ మొదలైంది. టెస్ట్ జట్టుల్లో తనకు చోటు ఇవ్వకపోవడంతో కోహ్లీపై రోహిత్ అలిగాడు. 
 
ఇందులో భాగంగా ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీని రోహిత్‌ అన్‌ఫాలో చేశాడని సమాచారం. దీనికి కారణం కూడా బలంగానే ఉండడంతో చర్చకు తెరపడడం లేదు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పాలంటూ ఇద్దరినీ ట్యాగ్ చేస్తూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై రచ్చ జరుగుతున్నా.. అటు రోహిత్ కానీ, ఇటు కోహ్లీ కానీ ఏమాత్రం స్పందించట్లేదు.