శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 26 సెప్టెంబరు 2018 (10:57 IST)

నేను నిన్ను ప్రేమిస్తే.. వేరే అబ్బాయితో సన్నిహితంగా వుంటావా?

సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో నేరాల సంఖ్య పెరిగిపోతుంది. తాను ప్రేమించిన అమ్మాయి వేరే అబ్బాయితో సన్నిహితంగా వుండటాన్ని ఓర్చుకోలేని ఓ వ్యక్తి.. ఆమెపై కక్ష పెంచుతుని దారుణంగా హతామార్చాడు. ఈ ఘటన

సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో నేరాల సంఖ్య పెరిగిపోతుంది. తాను ప్రేమించిన అమ్మాయి వేరే అబ్బాయితో సన్నిహితంగా వుండటాన్ని ఓర్చుకోలేని ఓ వ్యక్తి.. ఆమెపై కక్ష పెంచుతుని దారుణంగా హతామార్చాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే, నిజాంనగర్ ప్రాంత వాసి రిజ్వాన్‌ఖాన్ (20) అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో గత 11 నెలలుగా ప్రేమలో వున్నాడు. తన ప్రేయసి మరో యువకుడితో స్నేహంగా ఉంటుందని తెలిసిన రిజ్వాన్ ఖాన్ ప్రేయసితో గొడవపడ్డాడు. 
 
అనంతరం కత్తి తీసుకొని ప్రియురాలి మెడ కోసి రెండు ముక్కలు చేశాడు. ప్రేయసి శవాన్ని రెండు బ్యాగుల్లో ప్యాక్ చేసి.. బారాపుల్లా ఫ్లై ఓవర్ కింద వున్న లాలాలజపతిరాయ్ మార్గ్ మురుగుకాల్వలో పడేశాడు. అనంతరం రిజ్వాన్ నేరుగా పోలీసుస్టేషనుకు వెళ్లి తాను తన ప్రేయసిని హత్య చేశానని లొంగిపోయాడు. నిరుద్యోగి అయిన రిజ్వాన్ తల్లీ, సోదరులతో కలిసి ఉంటున్నాడని  పోలీసులు తెలిపారు. 
 
ఇంకా తన ప్రేయసి మరో యువకుడితో సన్నిహితంగా వుండటం తనకు నచ్చలేదని అందుకే చంపేశానని పోలీసులతో నిందితుడు చెప్పాడు. పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.