మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 12 సెప్టెంబరు 2018 (09:44 IST)

పడక సుఖం కోసం వచ్చిన ప్రియుడుకి విషం కలిపిన మద్యం తాగించిన ప్రియురాలు

రాత్రిపూట పడక సుఖం కోసం తన వద్దకు వచ్చిన ప్రియుడుకి విషం కలిపిన మద్యాన్ని ప్రియురాలు తాపించింది. ఈ మద్యం తాగిన ప్రియుడు చనిపోయాడు. ఆ తర్వాత ఆ ప్రియురాలు పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు

రాత్రిపూట పడక సుఖం కోసం తన వద్దకు వచ్చిన ప్రియుడుకి విషం కలిపిన మద్యాన్ని ప్రియురాలు తాపించింది. ఈ మద్యం తాగిన ప్రియుడు చనిపోయాడు. ఆ తర్వాత ఆ ప్రియురాలు పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ఆమె కోసం గాలిస్తున్నారు.
 
నోయిడాకు చెందిన 21 యేళ్ళ అన్షుల్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఈ యువతి హరోల్లా గ్రామంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఈ నేపథ్యంలో నోయిడాలోని సెక్టార్ 15 మెట్రోస్టేషను వద్ద ఉన్న ఓ గదిలో అన్షుల్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయాన్ని ఇరుగుపొరుగువారు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశాడు. 
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. ఈ విచారణలో ప్రియురాలు ఇంటికి అన్షుల్ రాత్రిపూట వచ్చివెళ్లేవాడని తేలింది. అంటే పడక సుఖం వచ్చిన ప్రియుడు అన్షుల్‌కు విషం కలిపిన బీరు తాగించి పరారైంది. విషం కలిపిన బీరు తాగిన అన్షుల్ మరణించాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసుకొని హంతకి అయిన ప్రియురాలి కోసం గాలిస్తున్నారు.