మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 27 సెప్టెంబరు 2018 (15:22 IST)

గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన మిల్కీ బ్యూటీ

సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరొందిన హీరోయిన్ తమన్నా. ప్రస్తుతం ఈమె గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నట్టు సమాచారం.

సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరొందిన హీరోయిన్ తమన్నా. ప్రస్తుతం ఈమె గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నట్టు సమాచారం.
 
ప్రస్తుతం చిరంజీవి తన 151వ చిత్ర "సైరా నరసింహా రెడ్డి" చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంల నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో సైరా చిత్రం తర్వాత చిరంజీవి తన 152వ చిత్రంగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సందేశాత్మక చిత్రంలో నటించినున్నారు. ఇందులో హీరోయిన్‌గా తొలుత అనుష్కను ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇది నిజమేనని అందరూ భావించారు. 
 
కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో తమన్నాను చిత్రబృందం ఎంపిక చేసిందట. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే మెగా హీరోలు పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌ల సరసన నటించి మెప్పించింది. ఇప్పుడు చిరు సరసన నటించబోతోందని తెలుస్తోంది. సోషల్ మెసేజ్‌ని ఇవ్వడంలో కొరటాల దిట్ట. మరి సినిమాను ఏ విధంగా తెరకెక్కిస్తారో చూడాలి.
 
ఈ వార్తే గనుక నిజమైతే.. తమన్నా కోరిక నెరవేరినట్టే. ఆ మధ్య ఓ సినిమా ఫంక్షన్‌లో చిరంజీవి వేదికపై ఉన్నపుడే తమన్నా మాట్లాడుతూ, మెగాస్టార్‌తో కలిసి స్టెప్పులేయాలని, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఇపుడు ఆమె కోరిక నెరవేరే అరుదైన అవకాశం వచ్చిందని చెప్పొచ్చు.