బుధవారం, 27 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: గురువారం, 11 అక్టోబరు 2018 (15:28 IST)

ఆ విషయంలో మావారు స్ట్రాంగ్... ఛీ...పాడు ఆమె అలా చెప్తుందేమిటి?

ఇటీవలే కొత్తగా ఉద్యోగంలో చేరాను. నేను బిడియస్తురాలిని కావడంతో ఎవరితోనూ మాట్లాడలేదు. కానీ ఓ వారం క్రితం నాకంటే రెండుమూడు సంవత్సరాలు పెద్దదైన మరో సహఉద్యోగి నాతో పరిచయం చేసుకుంది. ఆమె మాటతీరు నాకు బాగా నచ్చింది.


ఇద్దరం ఆఫీసులో ఎన్నో విషయాలపై చర్చించుకున్నాం. కానీ మొన్న హఠాత్తుగా శృంగార విషయాలు గురించి చెప్పడం మొదలుపెట్టింది. తన భర్త శృంగారం చేయడంలో చాలా పవర్‌ఫుల్ అనీ, ఇంకా ఏవేవో బెడ్రూం సంగతులు చెప్పింది. ఆ సంగతులు నాతో పంచుకోవడం ఎబ్బెట్టుగా అనిపించింది. ఆ విషయాలు స్త్రీలు కూడా చెప్పుకుంటారా...? ఆమె నాతో ఇలా చెప్పుకోవచ్చా...? ఇలాగే మరొకరివద్ద చెబితే ఆమె వ్యక్తిగత జీవితం పలుచనైపోదా...? 
 
సాధారణంగా భార్యాభర్తల శృంగార జీవితంలో చోటుచేసుకునే ప్రతి సంఘటన, ముద్దూముచ్చట్లు అత్యంత రహస్యంగా ఉండాలని ప్రతి స్త్రీపురుషుడూ కోరుకుంటారు. కానీ ఇవి ఎలాగో లీకవుతుంటాయనీ, ఈ రహస్యంపై యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ తయారీదారు మెకాఫీ అనే సంస్థ ఒక సర్వే నిర్వహించింది. 
 
ఈ సర్వేలో అనేక ఆసక్తికరమైన అంశాలను బహిర్గతమయ్యాయి. అందులో వెల్లడైన ఫలితాలు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యం కలిగించకమానవు. పురుషుల కంటే అధికంగా స్త్రీలే తమ ముద్దుముచ్చట్లను వీడియోలో చిత్రీకరించి తమ స్నేహితులకు మొబైల్ ద్వారా పంపుతున్నట్టు తేలింది. 
 
శృంగార భరితమైన టెక్స్ట్ మెసేజిలు, ఎమ్మెమ్మెస్‌లు పంపుతామని 59 శాతం మంది మహిళలు అంగీకరించగా, ఈ విషయంలో పురుషుల శాతం 57. ఇక, ఇలాంటి ప్రైవేటు విషయాలను వీడియోల్లో బంధిస్తామని 30 శాతం మంది మహిళలు తెలుపగా, ఈ విషయంలోనూ పురుషుల కేవలం 27 శాతం మంది మాత్రమే తమ వ్యక్తిగత విషయాలను చిత్రీకరిస్తామని చెప్పారు. ఈ సర్వేను 18 - 55 యేళ్ల మధ్య ఉన్న 1008 మంది భారతీయులపై సర్వే నిర్వహించింది. 
 
కాబట్టి అత్యంత సన్నిహితంగా మెలగేవారితో స్త్రీలు కూడా తమ పడక గది అనుభవాలను పంచుకుంటారని తేలింది. ఇకపోతే బెడ్రూం సంగతులను మీకు చెబితే మీరు లీక్ చేస్తారని ఆమె అనుకోకపోవచ్చు. జీవితంలో అన్ని విషయాల్లానే శృంగారం కూడా ఒకటి కాబట్టి దాని గురించి ఎప్పుడోసారి చర్చ రావడం మామూలే. దీని గురించి అంతగా ఆలోచించాల్సినవసరం లేదు.