ఆ మూడింటితో మహిళలకు పవర్... లేదంటే ఏం జరుగుతుంది?

women
Last Modified మంగళవారం, 9 అక్టోబరు 2018 (17:53 IST)
మహిళలకు క్యాల్షియం, డి విటమిన్ ఎంతో అవసరమని వైద్యులు చెపుతూ వుంటారు. క్యాల్షియం, డి విటమిన్ లోపిస్తే.. నడుము నొప్పులు, కీళ్ల నొప్పులతో ఇక్కట్లు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. కోడిగుడ్డులో తెల్లసొనతో పాటు, గింజల ద్వారా విటమిన్ డి లభిస్తుంది. 
 
అలాగే డి విటమిన్ కోసం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చర్మంపై సూర్యరశ్మి పడేలా చూసుకోవాలి. కండరాలు పటిష్టంగా ఉండటం, హృదయం సరిగ్గా పనిచేసేందుకు, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గకుండా ఉండేందుకు డి విటమిన్ ఎంతో అవసరమని నిపుణులు అంటున్నారు. 
 
ఇంకా గర్భిణీ మహిళలకు క్యాల్షియం, విటమిన్ డి చాలా ముఖ్యం. అలాగే 35 ఏళ్లు దాటిన మహిళలకు తప్పకుండా ఐరన్, క్యాల్షియం, డి విటమిన్ అవసరం. మహిళలకు క్యాల్షియం, డి విటమిన్, ఐరన్ లోపించకుండా ఉంటే కొలెస్ట్రాల్ సమస్యలు, కీళ్లనొప్పులు, మోకాలి నొప్పులు, నడుము నొప్పులను అడ్డుకోవచ్చని చెబుతున్నారు.దీనిపై మరింత చదవండి :