శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : ఆదివారం, 7 అక్టోబరు 2018 (14:08 IST)

రోజూ అరకప్పైనా మొలకెత్తిన ధాన్యాలు తీసుకుంటే..?

వర్షాకాలంలో మొలకెత్తిన ధాన్యాలు తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. వర్షాకాలంలో తేలికగా జీర్ణం అయ్యే ఆహారంతో శరీరం ఉత్సాహంగా తయారవుతుంది.

వర్షాకాలంలో మొలకెత్తిన ధాన్యాలు తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. వర్షాకాలంలో తేలికగా జీర్ణం అయ్యే ఆహారంతో శరీరం ఉత్సాహంగా తయారవుతుంది.


అందుకే శరీరానికి పుష్కలంగా ప్రొటీన్స్, కాల్షియం, ఐరన్ వంటివి ఎక్కువ మోతాదులో అందించే మొలకలను వర్షాకాలం తీసుకోవాలి. రోజూ ఒక అరకప్పైనా మొలకలు తీసుకుంటే మధుమేహం దరిచేరదు. వీటిల్లో రోగనిరోధక శక్తిని పెంచే గుణం అధికంగా ఉంది. 
 
మెులకల్లో విటమిన్ కె, సి, ఎ, ఐరన్, క్యాల్షియం, మినరల్స్, జింక్, కాపర్, మెగ్నిషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. మెులకలను తరచుగా ఆహారంలో చేర్చుకుంటే రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. దీంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. 
 
మొలకలు జీర్ణశక్తిని పెంచేందుకు చక్కగా ఉపయోగపడుతాయి. రక్తహీనతను తగ్గించుటకు మెులకలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. అధిక బరువును తగ్గించటానికి చక్కటి తోడ్పాటును అందిస్తాయి. అంతేగాకుండా.. చెడు కొలెస్ట్రాల్, రక్తపోటుల స్థాయిని క్రమేపీ తగ్గిస్తాయి. క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతాయి. ముఖ్యంగా కంటి చూపును మెరుగుపరచుటకు మంచిగా దోహదపడుతాయి.