మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : శనివారం, 6 అక్టోబరు 2018 (11:10 IST)

కరివేపాకును వేడినీటిలో మరిగించుకుని తీసుకుంటే..?

కరివేపాకు లేని వంటకం ఉండదు. కరివేపాకులోని విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కరివేపాకును నీటిలో మరిగించి పిల్లలకు తాపిస్తే ఆరోగ్యంగా ఉంటారు. దాంతో వెంట్రుక సమస్యలు తొలగిపోయి జుట్టు మృదువుగా మారుతుంది. కరివేపాకుని వేడినీటిలో మరిగించుకుని అందులో కొద్దిగా చక్కెర, అల్లం వేసుకుని తీసుకుని తీసుకుంటే నిద్రలేమి సమస్యలు తొలగిపోతాయి.
   
 
అలానే వేపాకులను పేస్ట్‌లా చేసుకుని అందులో పసుపు, సున్నిపిండి కలుపుకుని ముఖానికి రాసుకుంటే మెుటిమలు తొలగిపోతాయి. అలాకాకుంటే వెల్లుల్లి పేస్ట్‌లా తయారుచేసుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకున్నా మంచి ఫలితం లభిస్తుంది. అలర్జీలు ఎక్కువగా ఉన్నప్పుడు నువ్వులు, పెసరపప్పును మెత్తగా రుబ్బుకుని ఆ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుంటే అలర్జీలు తొలగిపోతాయి.