శనివారం, 25 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 4 అక్టోబరు 2018 (12:25 IST)

ఊరగాయలు వద్దు.. వేడి వేడి అన్నంలో కరివేపాకు పొడిని చేర్చి తీసుకుంటే..?

అధిక రక్తపోటును నియంత్రించాలంటే.. ఆహారంలో కరివేపాకు పొడిని చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కరివేపాకు, ధనియాలు వేయించి పొడి చేసుకుని డబ్బాలో భద్రపరుచుకోవాలి. ప్రతీరోజూ వేడివేడి అన్నంలో

అధిక రక్తపోటును నియంత్రించాలంటే.. ఆహారంలో కరివేపాకు పొడిని చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కరివేపాకు, ధనియాలు వేయించి పొడి చేసుకుని డబ్బాలో భద్రపరుచుకోవాలి. ప్రతీరోజూ వేడివేడి అన్నంలో ఈ పొడిని చెంచా కలిపి మొదటి ముద్దలో తినాలి. ఇలా రోజూ చేస్తే హైబీపీని నిరోధించడమే కాకుండా నియంత్రించుకోవచ్చు. 
 
ఇంకా వెల్లుల్లి రక్తపోటు తగ్గించేందుకు తోడ్పడుతుంది. నిత్యం రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను ఆహారంతో కలిపి తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌  సమస్య ఉండదు. ఆహారంలో పచ్చి ఉల్లిపాయని నిత్యం వాడటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. సలాడ్లలో దీన్ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా హైబీపీని దూరం చేసుకోవచ్చు. 
 
ముఖ్యంగా నూనెలో వేయించిన చిప్స్‌, అప్పడాలు, వడియాలు, స్నాక్స్, ఊరగాయలు తీసుకోకూడదు. ఉప్పు అధికంగా ఆహారంలో చేర్చుకోకూడదు. ఉప్పు అధికమైతే అధిక రక్తపోటుకు దారితీస్తుంది. అందుకే ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

అలాగే మానసిక ఒత్తిడి బాగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. వ్యాయామం, యోగాతో పాటు 30 నిమిషాల వాకింగ్ చేస్తే హైబీపీ నియంత్రణలో వుంటుందని వారు చెప్తున్నారు.