మంగళవారం, 28 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 27 సెప్టెంబరు 2018 (12:58 IST)

ఆ సమస్య ఉన్నప్పుడు వెల్లుల్లి రెబ్బను నోట్లో పెట్టుకుంటే..?

వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వంటకాల్లో వాడుతుంటారు. దీనితో టీ కూడా తయారుచేసుకోవచ్చును. దగ్గు సమస్య ఉన్నప్పుడు వెల్లుల్లి రెబ్బను నోట్లో పెట్టుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. దీని రసాన్ని పులిపిరులు ఉన్న ప్రాంతాల్లో రాసుకుంటే అవి తొలగిపోతాయి. వెల్లుల్ల

వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వంటకాల్లో వాడుతుంటారు. దీనితో టీ కూడా తయారుచేసుకోవచ్చును. దగ్గు సమస్య ఉన్నప్పుడు వెల్లుల్లి రెబ్బను నోట్లో పెట్టుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. దీని రసాన్ని పులిపిరులు ఉన్న ప్రాంతాల్లో రాసుకుంటే అవి తొలగిపోతాయి. వెల్లుల్లిపాయలను కచ్చాపచ్చాగా చేసుకుని అందులో కొద్దిగా సైంధవ లవణం, నువ్వుల నూనె కలుపుకుని తీసుకోవాలి.
 
దాంతో దవడలు పట్టేసే వ్యాధి తగ్గుముఖం పడుతుంది. వెల్లుల్లి మెత్తగా నూరుకుని నువ్వుల నూనెతో, ఆవు నెయ్యితో లేదా బియ్యపు గంజితో కలిపి సేవిస్తే భుజం నొప్పులు, తలనొప్పి వంటి సమస్యలు తొలగిపోతాయి. 50 గ్రాముల సుగంధిపాల వేర్లు, వెల్లుల్లి రెబ్బలు జతచేతి పేస్ట్‌లా చేసుకుని దాని రసాన్ని పిండి రోజుకు రెండుపూటలా తీసుకుంటే స్త్రీలకు రుతు సమయంలో వచ్చే నొప్పులు తొలగిపోతాయి. 
 
వెల్లుల్లి మిశ్రమంలో కొద్దిగా నువ్వుల నూనె కలుపుకుని వేడివేడి అన్నంతో తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వెల్లుల్లి రెబ్బలు ప్రతిరోజూ తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపుతుంది. దాంతో గుండె వ్యాధులు రావు. వెల్లుల్లి పాయపై గల పొట్టును కాల్చుకుని మసిచేసి నూనెలో కలుపుకుని తలకు రాసుకుంటే తెల్ల వెంట్రుకలు రావు.