నొప్పులను తగ్గించేందుకు ''ఆ'' పదార్థాలు వాడితే..?

శరీంలో ఏ భాగంలోనైనా కొద్దిగా నొప్పులు వస్తే చాలు వెంటనే మెడిసిన్స్ వాడుతుంటారు. పెయిన్ కిల్లర్స్‌ను ఉపయోగిస్తుంటారు. వీటిని వాడడం వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ వంటి సమస్యలు ఏర్పడుతాయి. అందువలన సహజ సిద్ధమైన

garlic
Kowsalya| Last Updated: సోమవారం, 3 సెప్టెంబరు 2018 (12:03 IST)
శరీంలో ఏ భాగంలోనైనా కొద్దిగా నొప్పులు వస్తే చాలు వెంటనే మెడిసిన్స్ వాడుతుంటారు. పెయిన్ కిల్లర్స్‌ను ఉపయోగిస్తుంటారు. వీటిని వాడడం వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ వంటి సమస్యలు ఏర్పడుతాయి. అందువలన సహజ సిద్ధమైన పదార్థాలతో ఈ నొప్పులను తగ్గించుకోవచ్చును. మరి ఆ పదార్థాల గురించి తెలుసుకుందాం.
 
పసుపులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి నొప్పులు, వాపులను తగ్గించుటకు ఉపయోగపడుతాయి. అందుకు ప్రతిరోజూ పాలలో పసుపును కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అల్లం రసాన్ని తరచుగా తీసుకోవడం నొప్పుల నుండి బయటపడవచ్చును. లవంగాలను పొడిచేసుకుని అందులో కొద్దిగా ఆలివ్ నూనెను కలుపుకుని నొప్పులున్నచోట రాసుకోవాలి.
 
గోరువెచ్చని నీటిలో కొద్దిగా తేనెను, యాపిల్ సైడర్ వెనిగర్‌‌ను కలుపుకుని తాగితే నొప్పున నుండి ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లి రెబ్బల్ని నలుపుకుని ఆ మిశ్రమంలో కొద్దిగా ఉప్పును చేర్చుకుని నొప్పులున్న భాగంలో రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 



దీనిపై మరింత చదవండి :