శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Kowsalya
Last Updated : శనివారం, 1 సెప్టెంబరు 2018 (15:30 IST)

ఉసిరి చూర్ణంలో నెయ్యి కలుపుకుని తీసుకుంటే?

ఉసిరి పండ్ల రసంలో కొద్దిగా బెల్లం కలుపుకుని తాగితే అరికాళ్ల మంటలు, ఒంట్లో వేడి వంటి సమస్యలు తొలగిపోతాయి. అలసట, నీరసంగా ఉన్నప్పుడు ఈ ఉసిరి మిశ్రమాన్ని తరచుగా తీసుకుంటే ఉత్సాహం ఉంటారు. ఉసిరికాయ పొడిలో న

ఉసిరి పండ్ల రసంలో కొద్దిగా బెల్లం కలుపుకుని తాగితే అరికాళ్ల మంటలు, ఒంట్లో వేడి వంటి సమస్యలు తొలగిపోతాయి. అలసట, నీరసంగా ఉన్నప్పుడు ఈ ఉసిరి మిశ్రమాన్ని తరచుగా తీసుకుంటే ఉత్సాహం ఉంటారు. ఉసిరికాయ పొడిలో నీరు, చక్కెర లేదా తేనె కలుపుకుని తాగితే స్త్రీలకు రుతు సమయంలో వచ్చే నొప్పులు తగ్గిపోతాయి.
 
ఉసిరికాయ చూర్ణంలో నువ్వుల చూర్ణం, నెయ్యి కలుపుకుని ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకుంటే జ్ఞాపక శక్తిని పెంచుటకు మంచిగా ఉపయోగపడుతుంది. కంటిచూపును మెరుగుపరచుటకు ఉసిరికాయ రసం దివ్యౌషధంగా పనిచేస్తుంది. అలర్జీ, దద్దుర్లు వంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఉసిరి చూర్ణంలో కొద్దిగా కొబ్బరినూనెను కలుపుకుని ఆ ప్రాంతాల్లో రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 
 
3 గ్రాముల ఉసిరి గింజలను నీటిలో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో తేనె, పటిక బెల్లం కలుపుకుని తాగితే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.