1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. beauty tips with rice powder and milk

బియ్యం పిండిలో పాలు కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

బియ్యం పిండిలో కొద్దిగా పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం ముడతలు తొలగిపోయి మృదువుగా మారుతుంది. బ్రెడ్ ముక్కలను పొడిచేసుకుని

rice
బియ్యం పిండిలో కొద్దిగా పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం ముడతలు తొలగిపోయి మృదువుగా మారుతుంది. బ్రెడ్ ముక్కలను పొడిచేసుకుని అందులో కొద్దిగా మీగడను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి.
 
20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖచర్మం కాంతివంతంగా తెల్లగా మారుతుంది. పాలపొడిలో నిమ్మరసం, తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై గల నల్లటి మచ్చలు, మెుటిమలు తొలగిపోతాయి. తద్వారా ముఖం తాజాగా మారుతుంది.
 
పాలలో కొద్దిగా నిమ్మరసం, తేనె, పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది. బంగాళాదుంప రసంలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం అలసటను తొలగిపోయి తాజాగా మారుతుంది. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
ఎగ్‌తో సూప్ ఎలా చేయాలో తెలుసా?