మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 28 ఆగస్టు 2018 (17:09 IST)

గంజిలో శొంఠి పొడి, ఉప్పు కలుపుకుని తాగితే?

పెరుగులో శొంఠి, పిప్పళ్లు, మిరియాల చూర్ణాన్ని, కొద్దిగా ఉప్పు కలుపుకుని ప్రతిరోజూ కాపడం పెట్టుకుంటే మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. పిప్పళ్లు, శొంఠి బాగా వేయించుకుని మెత్తటి చూర్ణంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 400

పెరుగులో శొంఠి, పిప్పళ్లు, మిరియాల చూర్ణాన్ని, కొద్దిగా ఉప్పు కలుపుకుని ప్రతిరోజూ కాపడం పెట్టుకుంటే మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. పిప్పళ్లు, శొంఠి బాగా వేయించుకుని మెత్తటి చూర్ణంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 400 గ్రాముల పెరుగు, నువ్వుల నూనెలో కలుపుకోవాలి.
 
ఈ మిశ్రమంలో పెరుగు తడి ఆరిపోయిన తరువాత నూనెను మాత్రం మరిగించుకోవాలి. ఈ నూనె చల్లారిన తరువాత వడగట్టి నొప్పులు ఉన్న చోటు మర్దన చేసుకుని ఉప్పు కాపడం పెట్టుకుంటే కీళ్లనొప్పులు తగ్గుతాయి. ఇలా చేయడం వలన కాళ్లకి మంచి పటుత్వం వస్తుంది.  
 
కరక్కాయల్లోని గింజలను తీసివేసి మెత్తగా దంచి 100 గ్రాముల పొడికి 60 గ్రాముల మెత్తని సైంధవ లవణాన్ని కలుపుకుని మజ్జిగతో తీసుకుంటే వాతం నొప్పులు తగ్గించుటకు ఉపయోగపడుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ గ్లాస్ గంజిలో కొద్దిగా శొంఠి పొడి, ఉప్పు కలుపుకుని తాగితే కీళ్ల నొప్పులు త్వరగా తగ్గుతాయి.