1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
  4. health benefits of lemon and garlic

బార్లీ నీటిలో నిమ్మరసం కలుపుకుని తీసుకుంటే?

ఈ కాలంలో దగ్గు, జలుబు వంటి సమస్యలు అధికంగా వస్తుంటాయి. ఈ చిట్కాలు పాటిస్తే వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు నలుపుకుని గంటకోసారి వాసన పీల్చుకుంటే 6 గంటలల

lemon
ఈ కాలంలో దగ్గు, జలుబు వంటి సమస్యలు అధికంగా వస్తుంటాయి. ఈ చిట్కాలు పాటిస్తే వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు నలుపుకుని గంటకోసారి వాసన పీల్చుకుంటే 6 గంటలలో జలుబు త్వరగా తగ్గుతుంది. బార్లీ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తీసుకుంటే గుండెలో మంట తగ్గుతుంది.
 
అల్లం రసంలో తులసి, తేనెను కలుపుకుని ప్రతిరోజూ మూడు పూటల తీసుకుంటే జలుబు వెంటనే తగ్గుతుంది. శొంఠి పొడిలో మిరియాలు, తులసి ఆకుల పొడిని వేసుకుని కషాయంలా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా చక్కెరను కలుపుకుని వేడివేడిగా తాగితే ముక్కు దిబ్బడ, జలుబు వంటి సమస్యలు తొలగిపోతాయి. 
 
దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా మిరియాల పొడి వేసుకుని నీటితో బాగా మరిగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడగట్టి అందులో తేనెను కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గ్లాస్ వేడి నీటిలో నిమ్మరసం పిండుకుని అందులో తేనెను కలుపుకుని తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తిని పెంచి త్వరగా జలుబు తగ్గేలా చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
క్యాప్సికమ్ సూప్ ఎలా చేయాలో చూద్దాం...