మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 15 అక్టోబరు 2018 (12:29 IST)

#HeForShe ''మీ టూ''కు తోడుగా ''వుయ్ టూ''- మగవాళ్లూ వచ్చేస్తున్నారు (Video)

హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు జంప్ అయిన మీటూ ఉద్యమం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. పురుషులు కూడా తమకు జరిగిన అన్యాయాలపై నోరు విప్పేందుకు ముందుకు వస్తున్నారు.

హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు జంప్ అయిన మీటూ ఉద్యమం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. సినీ రంగంలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై మహిళలు గళం విప్పుతున్నారు. బాలీవుడ్‌లో సినీనటి తనుశ్రీ దత్తాతో మొదలైన మీటూ ఉద్యమం దక్షిణాదిన గాయని చిన్మయి శ్రీపాద ట్వీట్లతో తీవ్రరూపం దాల్చింది. 
 
అలాగే సినీ రంగ సెలెబ్రిటీలే కాకుండా ఎందరో మహిళా జర్నలిస్టులు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి నోరు విప్పుతున్నారు. ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు నానా పటేకర్‌పై హీరోయిన్ తను శ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలపై బిటౌన్‌లో రచ్చ మొదలైంది. 
 
స్టార్ హీరోయిన్లు తను శ్రీకి మద్దతు తెలుపుతున్నారు. అలాగే మాజీ ప్రపంచ సుందరి, అమితాబ్ కోడలు ఐశ్వర్యారాయ్ కూడా మీటూపై స్పందించింది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటపెట్టేసింది. 
 
ఈ నేపథ్యంలో ప్రముఖ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత వైరముత్తు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ యువ గాయని ఆరోపించారు. పెద్ద మనిషి ముసుగులో ఆయన చేస్తున్న అకృత్యాల గురించి జర్నలిస్టు సంధ్య మీనన్‌తో సోషల్‌ మీడియాలో పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఇలా మహిళా సెలెబ్రిటీలు పురుషులపై చేస్తున్న విమర్శలు వివాదానికి దారి తీస్తున్న నేపథ్యంలో.. పురుషులు కూడా తమకు జరిగిన అన్యాయాలపై నోరు విప్పేందుకు ముందుకు వస్తున్నారు. 
 
తాజాగా ఆడవాళ్ల బారినపడి మగవాళ్లు కూడా లైంగిక వేధింపులకు గురయ్యారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ''వుయ్ టూ'' అంటూ మగవాళ్లు సైతం తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై నోరు విప్పాలని మహిళా జర్నలిస్ట్ సుభుహీ సాఫ్వీ పిలుపునిచ్చారు. సమాజంలో వర్క్ ప్లేస్‌లో మహిళలు మాత్రమే లైంగిక వేధింపులకు గురవుతున్నారా... మగవాళ్లు గురవ్వడం లేదా అంటూ అడిగారు. 
 
మగవాళ్లు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారని.. లైంగిక వివక్ష అంశాలై ఆసక్తికరమైన ఆర్టికల్స్ రాసే సుభుహీ.. తన స్నేహితుడు ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పుకొచ్చారు. తన స్నేహితుడి మీడియాలో ఓ లేడీ బాస్ దగ్గర పనిచేసేవాడని ఆ లేడీ బాస్ ప్రతీరోజు అతన్ని లైంగికంగా వేధిస్తూ ఇబ్బంది పెట్టేదని ఆరోపించింది. 
 
ఆమె వేధింపులు తీవ్రమవ్వడంతో తన మిత్రుడు హెచ్ఆర్ విభాగానికి ఫిర్యాదు చేశారని తెలిపింది. ఇంతకాలం ఎంజాయ్ చేసి మోజు తీరాక వచ్చి ఫిర్యాదు చేస్తున్నావా అంటూ అతని ఫిర్యాదును స్వీకరించకుండా తిరస్కరించారట. దాంతో అతడు ఉద్యోగం మానేసి మరో మీడియాకు మారిపోయాడని తెలిపింది. 
 
మీ టూ ఉద్యమానికి నాంది పలికిన హాలీవుడ్‌ నిర్మాత హార్వీ విన్‌స్టైన్‌ ఇప్పుడు కోర్టులో కూడా ఇలాగే వాదిస్తున్నారని తెలిపింది. తన వద్ద డబ్బులు తీసుకుని, సినిమా అవకాశాలు పొందారు. ఇష్టపూర్వకంగా పడకను పంచుకున్నారు. అన్నీ అయ్యాక లేటు వయస్సులో తనపై అభాండాలు వేస్తున్నారని హార్వీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని విన్ స్టైన్ అమెరికా కోర్టులో వాదించారట.
 
లైంగిక వేధింపులకు గురైన మగవాళ్లు కూడా ఉంటారని, వారంతా  ఇప్పుడు వుయ్‌ టూ అంటూ ముందుకు రావాలని సుభుహీ సాఫ్వీ పిలుపునిచ్చారు. ఇంకేముంది..? భారత్‌లో అన్నీ రంగాల్లో మీ టూ ఉద్యమం ఊపందుకున్న వేళ.. ''వుయ్ టూ'' అంటూ పురుషులు కూడా ఉద్యమానికి తెరలేపుతారేమోనని నెటిజన్లు భావిస్తున్నారు.