శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 15 అక్టోబరు 2018 (13:17 IST)

ప్రియుడిని వదిలి వుండలేక.. నవవధువు ఏం చేసిందో తెలుసా?

ప్రియుడి కోసం భర్తను హత్య చేయాలనుకున్న ఓ నవవధువుకి చుక్కెదురైంది. తన ప్రియుడిని వదిలి వుండలేక.. ఓ నవవధువు.. అతనితో కలిసి భర్తను హతమార్చేందుకు పక్కా ప్లాన్ వేసింది.

ప్రియుడి కోసం భర్తను హత్య చేయాలనుకున్న ఓ నవవధువుకి చుక్కెదురైంది. తన ప్రియుడిని వదిలి వుండలేక.. ఓ నవవధువు.. అతనితో కలిసి భర్తను హతమార్చేందుకు పక్కా ప్లాన్ వేసింది. అయితే ఆ ప్లాన్ సక్సెస్ కాలేదు. చివరికి పోలీసులకు ఆ నవ వధువు దొరికిపోయింది. చెన్నై శివార్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కదిరవన్ (30)కు నెల రోజుల క్రితం తూత్తుకుడికి చెందిన అనిత (25)తో వివాహమైంది. ఆపై గత వారాంతంలో వారు సముద్ర తీరానికి వాహ్యాళికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరి బైకును అడ్డుకున్న ఇద్దరు కదిరవన్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అనిత ధరించిన 12 సవర్ల నగలు, రూ.1000 తీసుకుని పరారయ్యారు. తీవ్రగాయాలకు గురైన కదిరవన్ ఆస్పత్రిలో చేరాడు. తర్వాత అతని భార్య అనిత స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. కదిరవన్ పై దాడి జరుగుతున్న సమయంలో అనిత ఏ మాత్రం చలనం లేకుండా చూస్తుండిపోయింది. ఆమ వద్ద జరిపిన విచారణలో అసలు నిజయం బయటపడింది. 
 
కాలేజీ రోజుల్లో తాను జగన్ ప్రేమలో పడ్డానని.. పెద్దలు కదిరవన్‌తో పెళ్లి చేయించారని తెలిపింది. పెళ్లిని వదిలించుకునేందుకే కదిరవన్‌పై దాడి చేయించానని..అంగీకరించింది. దీంతో జగన్, అనితలను పోలీసులు అరెస్ట్ చేసి.. జైలు తరలించారు.