సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 25 అక్టోబరు 2018 (09:45 IST)

యువకుడు ప్రేమించాలని వేధించాడు.. ఏం చేయాలో తెలియక బాలిక ఆత్మహత్య...

బాలిక ప్రేమించలేదని ఇంటికొచ్చి వేధించాడు. ఆ వేధింపులు తట్టుకోలేక బాలిక ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని అడ్డగుట్ట ప్రాంతంలో చోటుచేసుకుంది. అసలు వివరాలు తెలుకుంటే.. ఆ బాలిక అడ్డగుట్టలోని వెంకట్‌నగర్‌లో ఉండేది. పేరు శివాని 10 తరగతి చదువుతున్నది. అదే నగరానికి చెందిన ప్రణరు అనే యువకుడు ఆ బాలికను ప్రేమించమని ప్రతిరోజు వేధించేవాడు.
 
అప్పటికి శివాని అతనిని అంతంగా పట్టించుకునేది కాదు. అయినా కూడా రోజురోజుకూ అతని వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సోమవారం నాడు అంటే అక్టోబర్ 22వ తేది శివాని ట్యూషన్ నుండి ఇంటికి వస్తున్నది. అప్పుడు ప్రణరు ఆ బాలికను వెంటాడుతూ ఏకంగా తన ఇంటికే వచ్చేశాడు. దాంతో శివాని చాలా బయటపడిపోయింది. 
 
ప్రణరు వేధింపులు భరించలేక చివరికి మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాసేపటి తరువాత శివాని తల్లి ఇంటికి వచ్చారు.. కూమార్తెను అలా చూసి తట్టుకోలేకపోయారు. ఇక ఏం చేయాలో తెలియక వెంటనే పోలీసులకు ఈ ఘటన గురించి తెలియజేసింది. దాంతో పోలీసులు నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు. బాలిక మృతుదేహాన్ని పోస్ట్‌మార్టం చేయడానికి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఇక కేసు దర్యాప్తులో ఉంది.