శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 23 అక్టోబరు 2018 (14:20 IST)

నేనేం తక్కువేం కాదు.. చిన్నప్పుడు అదే పనే చేసేవాడిని?: బూమ్రా

చిన్నారి ప్రాయంలో తాను కూడా ఇతర క్రికెటర్ల స్టైల్‌ను కాపీ కొట్టానని భారత బౌలర్ జస్‌ప్రీత్ బూమ్రా ఒప్పుకున్నాడు. పాకిస్థాన్‌కు చెందిన ఐదేళ్ల బాలుడు బూమ్రా బౌలింగ్ స్టైల్‌లో బంతి విసిరిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను దాదాపు 37వేల మందికి పైగా షేర్ చేసుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ వీడియో గురించి బూమ్రా స్పందిస్తూ... తాను కూడా చిన్నప్పుడు మాజీ బౌలర్ల స్టైల్‌లో బంతులేసేందుకు ప్రయత్నించానని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం తనలాంటి బౌలింగ్ స్టైల్‌లో ఇతరులు ప్రాక్టీస్ చేయడం చూస్తుంటే హ్యాపీగా వుందని బూమ్రా తెలిపాడు. 
 
అంతేగాకుండా .. టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బూమ్రా ఓ బుడ్డోడి బౌలింగ్‌కు ఫిదా అయిపోయానని చెప్పాడు. అచ్చం తనలాగే బౌలింగ్‌ చేస్తున్న ఆ బుడ్డోడిని చూస్తుంటే.. ప్రపంచ నెం.1 బౌలర్ అవుతాడని అప్పుడే జోస్యం చెప్పేస్తున్నాడు.