శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 30 జనవరి 2018 (09:46 IST)

బాహుబలి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. కీలుగుర్రం నుంచి కీరవాణి కాపీ కొట్టారట.. (video)

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల మదిని దోచిన ''బాహుబలి'' సినిమాకు సంగీత దర్శకుడిగా కీరవాణి పనిచేశారు. ఈ చిత్రానికి జక్కన్న దర్శకుడు. అనుష్క, ప్రభాస్, తమన్నా, రానా, నాజర్, రమ్యకృష్ణ తదితరులు ఈ చిత్రంల

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల మదిని దోచిన ''బాహుబలి'' సినిమాకు సంగీత దర్శకుడిగా కీరవాణి పనిచేశారు. ఈ చిత్రానికి జక్కన్న దర్శకుడు. అనుష్క, ప్రభాస్, తమన్నా, రానా, నాజర్, రమ్యకృష్ణ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా విడుదలై ఎన్నో నెలలు గడిచినా ఆ సినిమాపై నెటిజన్లు మాట్లాడుకుంటూనే వున్నారు.
 
తాజాగా ఎంఎం కీరవాణిని నెటిజన్స్ కాపీ మాస్టర్ అనేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ''అజ్ఞాతవాసి'' ఫ్రెంచ్ సినిమా కాపీ అంటూ వివాదం జరుగుతున్న తరుణంలో.. బాహుబలి చిత్రంలో మహేంద్ర బాహుబలిని గుర్తించిన కీలక సన్నివేశానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ను కీరవాణి కాపీ కొట్టారట.
 
అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'కీలుగుర్రం' బీజీఎంను కీరవాణి కాపీ చేశారని నెటిజన్లు వీడియోలతో పాటు పోస్టులు పెట్టేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఆ రెండు సన్నివేశాలనూ చూపుతూ నెట్టింట వైరల్ అవుతోంది. తాము కాపీ చేయడం లేదని, అది కేవలం స్ఫూర్తి మాత్రమేనని వివరణ ఇచ్చినా వీడియో మాత్రం వైరల్ అవుతూనే వుంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.