1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Bahubali Prabhas not agreed to matrimonial Advertisement Propose

పెళ్లికాని 'బాహుబలి' కావాంటే? ఓకే అంటే ప్రభాస్‌కు రూ.15 కోట్లు

పెళ్లికాని ప్రసాద్ పాత్రలో మల్లీశ్వరి చిత్రంలో వెంకటేష్ నటించిన సంగతి తెలిసిందే. ఐతే టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లికాని ప్రభాస్ అంటూ ఇప్పటికే ఒకటే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కు ఇప్పటికే 38 ఏళ్లు వచ్చేశాయి. మరి పెళ్లెప్పుడయ్యా అంటే మాత్రం న

Bahubali Prabhas
పెళ్లికాని ప్రసాద్ పాత్రలో మల్లీశ్వరి చిత్రంలో వెంకటేష్ నటించిన సంగతి తెలిసిందే. ఐతే టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లికాని ప్రభాస్ అంటూ ఇప్పటికే ఒకటే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కు ఇప్పటికే 38 ఏళ్లు వచ్చేశాయి. మరి పెళ్లెప్పుడయ్యా అంటే మాత్రం నోరు మెదపడంలేదు. పోనీ తన మనసులో ఎవరైనా వున్నారా అంటే అదీ లేదు. డేటింగులు గీటింగులు గట్రా వంటివి అసలే లేవు. కాబట్టి పెద్దవాళ్లు కుదిర్చిన పెళ్లి చేసుకునేందుకే ప్రభాస్ ఎదురుచూస్తున్నాడని అంటున్నారు. 
 
ఇకపోతే ప్రభాస్‌కు వున్న విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఓ ప్రముఖ మ్యాట్రిమొనీ సంస్థ ప్రయత్నించిందట. తమ సంస్థ ప్రకటనలో నటిస్తే రూ. 15 కోట్లు ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చిందట. ఐతే థీమ్ విన్న తర్వాత ప్రభాస్ ఆ ఆఫర్ తిరస్కరించాడట. 
 
ఇంతకీ ఆ థీమ్ ఏంటంటే.... ప్రభాస్ ఓ మహరాజులా నడిచి వస్తుంటాడు. అప్పుడు అతడిపై ఓ బ్యానర్ ప్రత్యక్షమవుతుంది. అదేమిటంటే... ఇలాంటి పెళ్లికాని బాహుబలి కావాలంటే మా మ్యాట్రిమొనీలో రిజిస్టర్ చేసుకోండి అనీ. ఈ థీమ్ విన్న ప్రభాస్ తిరస్కరించాడట.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
భార్యను రాణిలా చూసుకుంటానంటే అర్థం ఇదే?