ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: సోమవారం, 18 డిశెంబరు 2017 (14:18 IST)

రాంచరణ్‌, ప్రభాస్‌లు కలిసి ఆ బిజినెస్‌కు శ్రీకారం...

సినీ హీరోలు రాంచరణ్‌, ప్రభాస్‌లు కలిసి ఒక బిజినెస్ చేయబోతున్నారు. ఇప్పటికే రాంచరణ్‌ విమానయాన రంగంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే వ్యాపారంలో మరింత ముందుకు వెళ్ళాలని భావిస్తున్న రాంచరణ్‌ కొత్త వ్యక్తితో జతకట్ట బోతున్నాడు. అతనే ప్రభాస్. ప్రభాస్‌త

సినీ హీరోలు రాంచరణ్‌, ప్రభాస్‌లు కలిసి ఒక బిజినెస్ చేయబోతున్నారు. ఇప్పటికే రాంచరణ్‌ విమానయాన రంగంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే వ్యాపారంలో మరింత ముందుకు వెళ్ళాలని భావిస్తున్న రాంచరణ్‌ కొత్త వ్యక్తితో జతకట్ట బోతున్నాడు. అతనే ప్రభాస్. ప్రభాస్‌తో కలిసి ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్థం చేసుకున్నాడు రాంచరణ్‌.
 
అదే ఎపిలో కొత్త థియేటర్ల ప్రారంభం. థియేటర్లు అంటే సాదాసీదా థియేటర్లు కాదు.. ఒక కుటుంబం మొత్తం ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ సినిమా చూసేవిధంగా థియేటర్లు ఉండబోతున్నాయి. అధునాతన థియేటర్లను నిర్మించనున్నారు. ఈ అధునాతన థియేటర్లలో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంటిలో ఎలాగైతే కుటుంబం మొత్తం కూర్చుని టివీల్లో సినిమా చూస్తారో.. అదే విధంగా థియేటర్లలోను చూడొచ్చు. ఇప్పటికే ఇద్దరు హీరోలు కలిసి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.