ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 13 డిశెంబరు 2017 (12:31 IST)

జాతకాలు కలిసే అమ్మాయితోనే ప్రభాస్ వివాహం: కృష్ణంరాజు

బాహుబలి హిట్ కొట్టడంతో ప్రపంచ సినీ అభిమానులకు దగ్గరైన డార్లింగ్ ప్రభాస్... త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడని టాలీవుడ్ వర్గాల టాక్. బాహుబలి కో ఆర్టిస్ట్ దేవసేన అనుష్కతో డార్లింగ్ వివాహం జరుగుతుందని ఫి

బాహుబలి హిట్ కొట్టడంతో ప్రపంచ సినీ అభిమానులకు దగ్గరైన డార్లింగ్ ప్రభాస్... త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడని టాలీవుడ్ వర్గాల టాక్. బాహుబలి కో ఆర్టిస్ట్ దేవసేన అనుష్కతో డార్లింగ్ వివాహం జరుగుతుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ వివాహం జాతకాలు కలిసే అమ్మాయితో జరుగుతాయని క్లారిటీ ఇచ్చేశారు. 
 
ఓ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కృష్ణంరాజు మాట్లాడుతూ, ప్రభాస్ తన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే, జాతకాలు చూడటం మొదలెడతామని చెప్పారు. ప్రభాస్ పెళ్లికి ఎప్పుడు ఓకే చెప్తాడా అని ఎదురుచూస్తున్నామని కృష్ణంరాజు అన్నారు. బాహుబలి షూటింగ్ జరిగినన్ని రోజూలూ ప్రభాస్ ఎంతో తపన, శ్రమ, అంకితభావాన్ని చూపించాడని, అందుకే దేవుడు కూడా ఆశీర్వదించాడని చెప్పుకొచ్చారు. 
 
వైవాహిక జీవితం సజావుగా సాగాలంటే దంపతుల ఇద్దరి నక్షత్రాల బట్టే ఆధారపడి ఉంటుంది. మనం పుట్టిన నక్షత్రాన్ని బట్టి మనజీవితం ఎలా ఉంటుందో జ్యోతిష్యం చెబుతుందని చెప్పుకొచ్చారు.
 
ఇదిలా ఉంటే.. బాహుబలి 2 సినిమాను ఇప్పటికే చైనాలో భారీ రిలీజ్‌కు ప్లాన్ చేయగా.. టోక్యో, ఒసాకోలో ప్రీమియర్ షో ప్రదర్శనలు జరిగాయి. కాగా జపాన్‌‌లోనూ బాహుబలి2 రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. ఇటీవల జపాన్‌లో సెన్సార్ కంప్లీట్ చేసుకున్న బాహుబలి 2 చిత్రం యు/ఏ సర్టిఫికేట్‌ను పొందింది.
 
తాజాగా ఈ విషయాన్ని సినీ యూనిట్ ట్విట్టర్‌లో తెలియజేస్తూ ప్రభాస్, అనుష్క ఉన్న జపాన్ బాహుబలి 2 పోస్టర్‌ను విడుదల చేసింది. ఇటీవల మాస్కో ఇంటర్నేషనల్ మూవీ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన బాహుబలి 2కి మంచి స్పందన రాగా, ఈ చిత్రాన్ని చైనా, రష్యా, కొరియా దేశాల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు బాహుబలి మేకర్స్.