శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2017 (12:16 IST)

వీరు-అనుష్క వైవాహిక జీవితంలో సమస్యలొస్తాయట..?

బాలీవుడ్ అందగత్తె అనుష్క, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీల వివాహం ఇటలీలో డిసెంబర్ 12వ తేదీన జరుగనుంది. ఈ ప్రేమ పక్షులు వివాహ బంధంతో ఒక్కటికానున్నారు. ఇన్నాళ్లు సీక్రెట్‌గా తమ ప్రేమాయణాన్ని కొనసాగించి

బాలీవుడ్ అందగత్తె అనుష్క, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీల వివాహం ఇటలీలో డిసెంబర్ 12వ తేదీన జరుగనుంది. ఈ ప్రేమ పక్షులు వివాహ బంధంతో ఒక్కటికానున్నారు. ఇన్నాళ్లు సీక్రెట్‌గా తమ ప్రేమాయణాన్ని కొనసాగించిన వీరు-అనుష్క.. మూడుముళ్ళ బంధంతో వివాహ జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ వార్త విన్న ప్రపంచ క్రికెట్ అభిమానులు, ప్రపంచ సినీ అభిమానులు వీరు-అనుష్కకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇద్దరి స్నేహితులు, శ్రేయోభిలాషులు వారి వైవాహిక జీవితం సంతోషదాయకంగా వుండాలని శుభాకాంక్షలు చెపుతున్నారు. 
 
కానీ మాలవ్ భట్ అనే జ్యోతిష్యుడు ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరు, అనుష్క వివాహ జీవితంలో కొన్ని ఆటుపోట్లు తప్పవంటున్నారు. వివాహానంతరం వారిద్దరి మధ్యా చిన్నచిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. ఇద్దరూ వారి వృత్తులను, వ్యక్తిగత జీవితాన్ని సమతూకం చేసుకోలేక కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని జోస్యం చెప్పారు. ఆ ప్రభావం వారి వైవాహిక జీవితంపై పడుతుందని చెప్తున్నారు. కాబట్టి ఈ జంట భావోద్వేగాలను నియంత్రించుకుని.. తమ వైవాహిక జీవితంలో ఏర్పడే చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూడకుండా ముందుకు సాగాల్సి ఉంటుందని తెలిపారు.